AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా

పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 08, 2026 | 5:59 PM

Share

సంక్రాంతికి మన సినిమాలే ఐదు వస్తున్నాయి.. వాటికే థియేటర్లు సరిపోతాయా లేదా అనే చర్చ రోజూ జరుగుతుంది. ఇలాంటి సమయంలో మేము కూడా రేసులోనే ఉన్నామంటూ రెండు తమిళ సినిమాలు పొంగల్ బరిలోకి దిగుతున్నాయి. మరి వాటి థియేటర్ల పరిస్థితి ఏంటి..? అందులో ఒకటి ముందుగానే రేసు నుంచి తప్పుకుంటుందా..? అసలేంటి సిచ్యువేషన్..? రాజా సాబ్‌తో ఈసారి పండగ సీజన్ షురూ కానుంది.

సంక్రాంతికి మన సినిమాలే ఐదు వస్తున్నాయి.. వాటికే థియేటర్లు సరిపోతాయా లేదా అనే చర్చ రోజూ జరుగుతుంది. ఇలాంటి సమయంలో మేము కూడా రేసులోనే ఉన్నామంటూ రెండు తమిళ సినిమాలు పొంగల్ బరిలోకి దిగుతున్నాయి. మరి వాటి థియేటర్ల పరిస్థితి ఏంటి..? అందులో ఒకటి ముందుగానే రేసు నుంచి తప్పుకుంటుందా..? అసలేంటి సిచ్యువేషన్..? రాజా సాబ్‌తో ఈసారి పండగ సీజన్ షురూ కానుంది. జనవరి 8 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత 12న మన శంకరవరప్రసాద్ గారు, 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి, 14న అనగనగా ఒకరాజు, నారినారి నడుమ మురారి సినిమాలు రానున్నాయి. వీటికే థియేటర్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. తెలుగు సినిమాలకే థియేటర్స్ సమస్యలు ఉన్నాయంటే.. జనవరి 9న నేను ఉన్నానంటూ జన నాయకుడుతో విజయ్ వస్తున్నారు. ఇది భగవంత్ కేసరి రీమేక్ అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న వేళ.. ట్రైలర్‌తో క్లారిటీ వచ్చినట్లైంది. ఇప్పుడు హైలైట్ ఏంటంటే.. మన సినిమాను రీమేక్ చేసి మళ్లీ మనకే పోటీగా డబ్బింగ్ చేసి వదలడం. జనవరి 9న హైదరాబాద్‌లో జన నాయకుడికి థియేటర్స్ బాగానే దొరికాయి. తెలంగాణ, ఏపీలో కూడా ఈ సినిమాకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించట్లేదు. అదేరోజు రానున్న రాజా సాబ్‌తో స్క్రీన్స్ షేర్ చేసుకుంటున్నారు విజయ్. మరోవైపు జనవరి 10న రావాల్సిన పరాశక్తి తెలుగు వర్షన్ మాత్రం ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. పరాశక్తి తెలుగు వర్షన్ ట్రైలర్ ఇంకా రాలేదు. తమిళం వరకు మాత్రం ఇప్పుడు విడుదల చేసి.. తెలుగులో పండగ తర్వాత తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ పరాశక్తి రాకపోతే.. పండక్కి ఓ సినిమా తగ్గినట్లే. ఈ గ్యాప్ రాజా సాబ్‌కు హెల్ప్ అవుతుంది. మొత్తానికి ఈసారి థియేటర్స్ విషయంలో డబ్బింగ్ సినిమాలు కూడా కీలకంగా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లేచింది మహిళా లోకం.. ఆ సినిమాలో ఐదుగురు స్టార్ హీరోయిన్లు

మేమే హీరోయిన్స్.. మేమే స్పెషల్ గాళ్స్.. కొత్త ట్రెండ్

పాన్ ఇండియా ట్రెండ్‌కు దూరమవుతున్న బాలీవుడ్‌

Meenakshi Chaudhary: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి

హిట్ కొట్టాలంటే.. బ్రేక్ కావాల్సిందే అంటున్న క్రేజీ డైరెక్టర్స్‌