Poonam Kaur: పెళ్లి.. అబార్షన్.. నా లైఫ్ గురించి సోషల్ మీడియాలో
నటి పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈమె.. ఆతర్వాత సహాయక పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన పూనమ్.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన కాంట్రో కామెంట్స్ తో వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన తప్పుడు వార్తల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
నటి పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈమె.. ఆతర్వాత సహాయక పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన పూనమ్.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన కాంట్రో కామెంట్స్ తో వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన తప్పుడు వార్తల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మరో సారి తన మాటలతో అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియా… మీడియా తనను ఎలా తప్పుగా చిత్రీకరించిందో, రాజకీయ వర్గాల నుంచి తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పూనమ్ తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చేనేత వస్త్రాలపై జీరో జీఎస్టీ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 97 మంది ఎంపీల సంతకాలను సేకరించేందుకు తాను కృషి చేశానని చెప్పిన పూనమ్.. ఈక్రమంలోనే తనను ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అందరూ చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీతో తనకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. తన పెళ్లి అయిపోయిందని.. అబార్షన్ కూడా అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలకు తాను షాకయ్యానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఓ ప్రముఖ లీడర్‌తో తనకు లింకు పెట్టి ఏకంగా పెళ్లి చేశారని.. ఆయనతో పిల్లలు కూడా ఉన్నారంటూ వార్తలు పుట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు పూనమ్. వాళ్లు అనుకున్నట్టే.. ఒక రాజకీయ పార్టీతో .. లేదా ఆ పార్టీ టాప్ లీడర్‌తో సన్నిహితంగా ఉంటే తన జీవితం ఇంత కష్టంగా ఉండేది కాదు కదా అంటూ ప్రశ్నించారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలు తనకు పెద్ద ట్రామాను కలిగిస్తున్నాయి. ఆ ప్రభావం తన కుంటుంబం పడుతున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే తన అమ్మమ్మ హార్ట్ ఎటాక్ వచ్చిందని.. అప్పుడు తాను గిల్టీగా ఫీల్ అయినట్టు చెప్పుకొచ్చారు పూనమ్ కౌర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శంకరవరప్రసాద్ సెన్సార్ రివ్యూ.. అంతా ఓకే గానీ..
Varanasi: జక్కన్న ఝలక్.. వారణాసి రిలీజ్ డేట్ లాక్
పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

