పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
మహారాష్ట్రలో పంట పనులకు వెళ్లే కూలీలకు చిరుత పులుల భయం వెంటాడుతోంది. జనావాసాల్లోకి చొరబడుతున్న చిరుతలు పశువులను, మనుషులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దీంతో కూలీల రక్షణకు రైతులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిరుత దాడుల భయం తీవ్రంగా ఉంది.
పంట చేలల్లో పనులు చేస్తున్న కూలీలకు ఓ రైతు తుపాకీతో కాపలా కాస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని అహల్యానగర్ లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. ఊరు చివర్లో ఉన్న పంట పొలాల్లోకి తరచూ చిరుత పులులు వస్తున్నాయని, మనుషులపై దాడులు చేస్తున్నాయని తెలిపారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని వివరించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పులుల భయం ఎక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా ఖుద్సర్, పాథ్రే, మైగావ్, మంజరి ప్రాంతాల్లో ప్రస్తుతం చిరుతలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని చెప్పారు. దీంతో కూలీలకు రక్షణగా రైతులు తుపాకులు పట్టుకుంటున్నారు. కూలీలు పనులు చేస్తుంటే తాము అప్రమత్తంగా కాపలా కాస్తున్నామని ఖుద్సర్ కు చెందిన ఓ రైతు పేర్కొన్నారు. ఇటీవల తరచూ చిరుత పులులు, పులులు, జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గ్రామాల్లో చొరబడి పశువులను పొట్టపెట్టుకుంటున్నాయి. ఒక్కోసారి మనుషులపై దాడులకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. చిరుత దాడిలో పలువురు మృతిచెందిన సందర్భాలూ ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajinikanth: ‘ఎన్ని ఉన్నా.. అనాథలానే అనిపిస్తుంది’
Rajeev Kanakala: అవకాశాలు రావడం లేదుకానీ.. వస్తే తరుణ్‌కు తిరుగే ఉండదు
Chandrabose: నలభై రూపాయల పుస్తకానికి.. 40 లక్షలు.. చంద్రబోస్ తుంటరి పనితో.. ఊరికి మేలు
RGV: ‘ఆర్జీవీని సైకో అన్నారు..అందుకే భయపడ్డా’ కానీ.. ఆ తర్వాత
Poonam Kaur: పెళ్లి.. అబార్షన్.. నా లైఫ్ గురించి సోషల్ మీడియాలో
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!

