Weather: తుఫాన్ ముప్పు.! తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఇలా ఉంటుంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు సాయంత్రానికి శ్రీలంకలో హంబన్ తోట, బట్టికోల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు వర్షాలు పలకరించనున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక వాతావరణ సూచనలు ఇచ్చింది. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలో రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు నుంచి 3 డిగ్రీల తక్కువగా నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మెగావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో పొగ మంచు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, ములుగు, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 8.2 డిగ్రీలు.. హకీంపేటలో అత్యధికంగా 15.3 నమోదయ్యాయి.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
అటు ఏపీ విషయానికొస్తే.. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం మీదుగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఈ రోజు సాయంత్రం హంబన్‌టోట, కల్మునై మధ్య శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ పొగమంచు కురిసే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే చలి తీవ్రత కూడా స్వల్పంగా పెరిగింది. విజయనగరంలో అత్యల్పంగా 14 డిగ్రీలు.. నెల్లూరులో 20.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Light to Moderate rains ahead for some areas of South Coastal AP (Tirupati and Nellore districts) during January 11th and 12th:
“Never trust an off-season system unless it clearly shows the deepest level of convergence among different models” -> Is the hard learnt truth. Even… pic.twitter.com/o8Vp6uWCzu
— Andhra Pradesh Weatherman (@praneethweather) January 8, 2026
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




