Hyderabad: తీగ లాగితే మొత్తం డొంకే కదిలింది.. రూ.903 కోట్ల హవాలా కుంభకోణం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
గేమింగ్ యాప్ కేసులో అసలు గుట్టు విప్పారు హైదరాబాద్ పోలీసులు. మాయచేసి కోట్లు కొల్లగొట్టడమే కాకుండా... ఆ డబ్బును విదేశాలకు మళ్లించినట్లు గుర్తించారు.

హైదరాబాద్ గేమింగ్ యాప్ ఫ్రాడ్ కేసులో కొత్త కోణం తెరపైకి వచ్చింది. రూ.903 కోట్ల హవాలా కుంభకోణం కేసులో.. తీగ లాగితే మొత్తం డొంక కదిలినట్టు అసలు గుట్టు బయటపడింది. అల్లెన్, చున్‌చున్‌యూ.. ఈ ఇద్దరినీ ప్రధాన నిందితులుగా గుర్తించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. వీళ్లిద్దరూ కలిసే గేమింగ్ ఆప్ ద్వారా మోసాలకు పాల్పనట్టు తేల్చారు. విన్ గేమింగ్ యాప్‌లో నష్టపోయిన, మోసపోయిన బాధితులనే వీళ్లు టార్గెట్ చేశారు. వీళ్ల ద్వారా కొత్త బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఈవిధంగా అకౌంట్స్ ఓపెన్‌చేసిన సయ్యద్ సుల్తాన్ అండ్ మీర్జా నదీమ్‌లు.. దుబాయ్‌లో ఉండే పర్వేజ్‌తో కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు. ఇలా అకౌంట్స్ ఓపెన్‌చేసి ట్రాంజాక్షన్స్ జరిపినందుకు, ప్రతి ఒక్కరికీ నెలకు 50వేల రూపాయల చొప్పున నిందితులు జీతం చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.
ఇక, ఈ గేమింగ్ యాప్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకి ముందు లాభాలు వచ్చేలా చేస్తారు. పూర్తిగా గేమింగ్ యాప్ మాయలో పడ్డాక, అసలు గేమ్ మొదలుపెడతారు. ఒక్కసారి ఈ యాప్ మాయలో పడ్డారంటే ఇక దాన్నుంచి బయటికి రాలేకుండా బానిసలా మార్చేశారు. ఆ తర్వాత మొత్తం డబ్బు గుంజేస్తారు. ఇదీ ఈ ముఠా స్టైల్. ఈ కేసులో కీలకంగా మారిన ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడంతో మొత్తం గుట్టు రట్టయ్యింది. రెండేళ్లుగా దుబాయ్‌లోనే ఉంటూ కథ నడుపుతోన్న ఇంబ్రాన్… ఇటీవల ముంబై రావడంతో అరెస్ట్ చేశారు. ఇమ్రాన్‌ను విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఇమ్రాన్‌తోపాటు మరో నలుగురిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అలెన్ ఫిలిప్పీన్స్‌కు చెందినవాడని.. గేమింగ్ యాప్‌లను తయారు చేస్తున్న చైనా జాతీయులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసు అధికారి ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో నాగప్రసాద్, రామ్, సాగర్, శ్రీనివాస్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా IPLWIN గేమింగ్ యాప్‌లో డబ్బు పోగొట్టుకున్న బాధితులను గేమింగ్ యాప్ ద్వారా డబ్బు సంపాదించేందుకు బ్యాంక్ ఖాతాలను తెరిపించి మోసం చేసేవారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వచ్చిన డబ్బును విదేశాలకు పంపించేవారని వెల్లడించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
