‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్
ఈసారి సంక్రాంతికి రిలీజవుతోన్న తెలుగు సినిమాల్లో భర్తమహాశయులకు విజ్ఞప్తి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ కలిసి నటించారు. తాజాగా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మలు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ… డైరెక్టర్ కిషోర్ తిరుమల గారితో ముందు ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన ఇది కుదరలేదు. తర్వాత ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ చెప్పారు. కథ విన్నప్పుడే ఇందులో మోడ్రన్ గర్ల్ పాత్ర చేయాలని అనుకున్నాను. ఆయన కూడా అదే పాత్రకి అనుకున్నానని చెప్పారు. నా సామిరంగతో పోల్చుకుంటే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ క్యారెక్టర్. ఖచ్చితంగా నా కెరీర్ లో చాలా కొత్తగా వుంటుంది. ఇందులో నా పాత్ర పేరు మానస శెట్టి. ఇప్పుడున్న అమ్మాయిలు రిలేట్ అయ్యే క్యారెక్టర్. రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. అందులోనూ నాకు తెలుగు అంతగా రాదు. అయితే డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయన చాలా సెన్సిబుల్ డైరెక్టర్. మా పాత్రలని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. కాస్ట్యుమ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ చాలా అందంగా చూపించారు. కమర్షియల్ సినిమాల్లో హీరోల పాత్రల్లో ఎలాంటి తప్పులు కనిపించవు. కాకపోతే ఇప్పుడు కథల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది. అలాంటి పాత్రలని చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చుపిస్తున్నారు. ఇప్పుడున్న రిలేషన్షిప్స్ లో చాలా కాన్ఫ్లిక్ట్స్ వున్నాయి. అలాంటి అంశాలని దర్శకుడు అద్భుతంగా అందరూ రిలేట్ అయ్యేలా హ్యాండిల్ చేశారు. రవితేజ గారు అద్భుతమైన పెర్ఫార్మార్. ఫన్ ఎమోషన్ అద్భుతంగా పండించారు. ఆయనతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
‘ఇందులో సత్య నా పీఏ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అది చాలా మంచి నవ్వులు పంచే క్యారెక్టర్. రవితేజ గారు, సునీల్ గారు, వెన్నెల కిషోర్, సత్య అందరూ కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ వున్న నటులు. వాళ్ళ టైమింగ్ ని మ్యాచ్ చేయడం ఛాలెంజ్ గా అనిపించింది. నా ప్రతి సినిమా డిఫరెంట్ గా వుండాలని అనుకుంటాను, ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఖచ్చితంగా కొత్తదనం ఫీలౌతారు. సుధాకర్ చెరుకూరి గారు ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా కోసం స్పెయిన్ లో షూట్ చేశాం. సినిమా విజువల్ గా చాలా రిచ్ గా వుంటుంది. ఇందులో మాస్ సాంగ్ చేసినప్పుడు చిరంజీవి గారు సెట్స్ లోకి రావడం మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. ప్రస్తుతం విశ్వంభర, సర్దార్ 2 చిత్రాలు చేస్తున్నాను. అలాగే ‘అది నా పిల్లరా’ అనే మరో సినిమా చేస్తున్నాను. కెరీర్ బిగినింగ్ లోనే బిగ్ స్టార్స్ తో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని పేర్కొంది.
ఇక మరో హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ…’ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు ఈ కథ చెప్పాగానే నచ్చింది. ఈ కథ వినగానే ఇందులో వైఫ్ క్యారెక్టర్ బాలామణి పాత్ర చేయాలని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే రవితేజ గారి సినిమాలో ఒక మోడరన్ అమ్మాయి పాత్ర చేశాను. బాలామణి పాత్ర అయితే నాకు కొత్తగా వుంటుందనిపించింది. డైరెక్టర్ గారు కూడా బాలామణి పాత్ర కోసమే అనుకోవడం ఆనందంగా అనిపించింది. కథ చెప్పిన తర్వాత ఇందులో హీరో రవితేజ అని చెప్పడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. రవితేజ గారితో ఇది నా రెండో సినిమా. ఆయన వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. ఇందులో నాది వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. డైరెక్టర్ కిషోర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బాలామణి పాత్రలో కనిపించడం కొత్త ఎక్స్ పీరియన్స్. కాస్ట్యుమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. క్యారెక్టర్ కి తగ్గట్టు కలర్స్ ఎంచుకోవడం జరిగింది. అలాగే పాటల్లో మంచి కలర్ ఫుల్ కాస్ట్యుమ్స్ కనిపిస్తాయి. విజువల్స్ అన్నీ వైబ్రెంట్ గా వుంటాయి. అమ్మాయిలందరూ రిలేట్ అవుతారు. ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ వుంది. అది మీరు సినిమాలోనే చూడాలి. డైరెక్టర్ గారు ప్రతిది నటించి చూపిస్తారు. ఆయన డైలాగ్స్ కూడా చాలా యునిక్ గా వుంటాయి. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. కామెడీ చాలా సెన్సిబుల్ గా వుంటుంది. ఇందులో డ్యాన్స్ నెంబర్స్ కూడా అందరూ మాట్లాడుడుతున్నారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మా ఇద్దరి పర్ఫార్మెన్స్ ఎనర్జిటిక్ గా వుంటుంది. ఈ మూవీ జర్నీలో నేను ఆషిక చాలా మంచి ఫ్రండ్స్ అయ్యాం. మా మధ్య మంచి బాండింగ్ వుంది. నేను చిన్నప్పటి నుంచి సంక్రాంతి చెన్నై లో గ్రాండ్ పేరెంట్స్ తో కలసి సెలబ్రేట్ చేసుకుంటాను’ అని అంది.
