అనంతపురం జిల్లా రాయదుర్గంలో అర్ధరాత్రి దొంగతనం చేస్తూ ఒక దొంగ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. తాళం వేసిన షాపు పైకప్పు రేకులు కట్ చేసి లోపలికి దూకి దొంగతనానికి పాల్పడుతుండగా షాపు యజమాని అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వరుస దొంగతనాలతో భయపడిన స్థానికులు ఈ అరెస్టుతో ఊపిరి పీల్చుకున్నారు.