WPL 2026: 4వ సీజన్‌కు సరికొత్తగా డబ్ల్యూపీఎల్ రెడీ.. అంత స్పెషల్ ఏంటంటే..?
Mumbai Indians vs RCB: మహిళల క్రికెట్ అభిమానులకు శుభవార్త..! అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్ సందడి మొదలవ్వబోతోంది. 2026 సీజన్ షెడ్యూల్ ఖరారైంది. ఈసారి కూడా స్టార్ ప్లేయర్ల మెరుపులు, ఉత్కంఠభరిత పోరాటాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? మ్యాచ్‌లు ఎక్కడ చూడాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

WPL 2026 Squads Schedule Live Streaming: మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. నవీ ముంబై వేదికగా ఈ అట్టహాసమైన ప్రారంభ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లకు ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా తొలి మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈసారి కొత్తగా..
ఈసారి యూపీ వారియర్స్ జట్టు పూర్తిగా కొత్త లైనప్‌తో టోర్నమెంట్‌లోకి అడుగుపెడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మూడు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన సీనియర్ ప్లేయర్ మెగ్ లానింగ్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇండియన్ స్టార్ జెమిమా రోడ్రిగ్జ్ నాయకత్వం వహించనుంది. గుజరాత్ జెయింట్స్‌కు ఆస్ట్రేలియన్ ఆష్లీ గార్డ్నర్ నాయకత్వం వహిహించనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుంది. ముంబై ఇండియన్స్‌ను రెండుసార్లు ఛాంపియన్‌షిప్‌లకు నడిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. తొలిసారిగా, టోర్నమెంట్ మ్యాచ్‌లు వడోదరలో జరుగుతాయి.
పాల్గొనే జట్లు, మ్యాచ్‌ల సంఖ్య: ఈ నాలుగో సీజన్‌లో మొత్తం ఐదు జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి:
ముంబై ఇండియన్స్ (MI)
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
గుజరాత్ జెయింట్స్ (GG)
యూపీ వారియర్స్ (UPW)
ఈ సీజన్‌లో మొత్తం 22 ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనున్నాయి.
వేదికలు, సమయాలు: లీగ్ దశ మ్యాచ్‌లు వివిధ నగరాల్లో జరగనుండగా, కీలకమైన ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లకు వడోదర వేదికగా నిలవనుంది.
మధ్యాహ్నం మ్యాచ్‌లు: 3:00 గంటలకు ప్రారంభమవుతాయి.
సాయంత్రం మ్యాచ్‌లు: 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఫైనల్ మ్యాచ్: ఫిబ్రవరి 5, 2026న జరగనుంది.
గత సీజన్ల రికార్డులు: మహిళా ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు విజేతగా నిలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకసారి టైటిల్ గెలుచుకుంది. విశేషమేమిటంటే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా మూడు సార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ, ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈసారి ఆ లోటును భర్తీ చేస్తారో లేదో చూడాలి.
లైవ్ స్ట్రీమింగ్, టీవీ ఛానెల్స్: క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్‌లను టీవీలో, మొబైల్‌లో ఎక్కడైనా వీక్షించవచ్చు:
టీవీ: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network) లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
మొబైల్ / ఆన్‌లైన్: జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో మహిళల క్రికెట్‌కు వస్తున్న ఆదరణను డబ్ల్యూపీఎల్ మరింత పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ మహిళా క్రికెటర్లు ఒకే వేదికపై తలపడనుండటంతో ఈ 2026 సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. మీ ఫేవరెట్ టీమ్‌కు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉండండి..!
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



