AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: షాకింగ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. కివీస్ సిరీస్ నుంచి తప్పుకున్న డేంజరస్ ప్లేయర్.. కారణం ఏంటంటే?

India vs New Zealand T20I Series: న్యూజిలాండ్‌తో జరగనున్న కీలకమైన టీ20 సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ సంచలనం, స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అకస్మాత్తుగా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో మొదటి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని బీసీసీఐ (BCCI) ధృవీకరించింది. ఈ వార్త భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

IND vs NZ: షాకింగ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. కివీస్ సిరీస్ నుంచి తప్పుకున్న డేంజరస్ ప్లేయర్.. కారణం ఏంటంటే?
Ind Vs Nz T20i Series
Venkata Chari
|

Updated on: Jan 09, 2026 | 7:05 AM

Share

India vs New Zealand T20I Series: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో తిలక్ వర్మకు రాజ్‌కోట్‌లో అకస్మాత్తుగా కడుపు నొప్పి (Abdominal issue) రావడంతో బుధవారం అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది.

బీసీసీఐ ప్రకటన, రికవరీ ప్లాన్..

బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం, “తిలక్ వర్మకు బుధవారం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. గురువారం ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం తన స్వస్థలమైన హైదరాబాద్‌కు చేరుకుంటాడు. గాయం పూర్తిగా నయమై, శారీరకంగా ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే ఆయన తిరిగి నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెడతాడు” అని తెలిపింది.

తిలక్ వర్మ మొదటి మూడు టీ20 మ్యాచ్‌లకు (జనవరి 21 నుండి ప్రారంభం) ఖచ్చితంగా దూరమవుతారు. ఆ తర్వాత ఆయన కోలుకునే తీరును బట్టి, చివరి రెండు టీ20 మ్యాచ్‌లలో ఆడతారా లేదా అనేది వైద్య బృందం నిర్ణయిస్తుంది.

ఇవి కూడా చదవండి

తిలక్ వర్మ భావోద్వేగ సందేశం..

తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులకు తిలక్ వర్మ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాను త్వరగా కోలుకుంటున్నానని, అభిమానులు ఆశించిన దానికంటే ముందే మళ్ళీ మైదానంలోకి అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశాడు.

రీప్లేస్‌మెంట్ ఎవరు..?

తిలక్ వర్మ దూరం కావడంతో నంబర్-3 స్థానంలో ఎవరు ఆడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీసీసీఐ ఇప్పటివరకు అధికారికంగా ఎవరినీ రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించలేదు. అయితే, స్క్వాడ్‌లో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌ను మూడవ స్థానంలో ఆడించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా కొనసాగితే, ఇషాన్ కిషన్ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ లేకపోవడం టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ, యువ భారత్ ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. తిలక్ వర్మ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
ఆ ఒక్క వెంట్రుక పీకితే జుట్టు అంతా తెల్లగా అవుతుందా?
ఆ ఒక్క వెంట్రుక పీకితే జుట్టు అంతా తెల్లగా అవుతుందా?
పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా?
పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా?
ఇంట్లో ఉపయోగించే ఆవ నూనె నిజమైనదా లేక నకిలీదా? ఇలా చెక్‌ చేయండి!
ఇంట్లో ఉపయోగించే ఆవ నూనె నిజమైనదా లేక నకిలీదా? ఇలా చెక్‌ చేయండి!
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
తెలుగు రాష్ట్రాల్లో JEE Advanced 2026 పరీక్ష కేంద్రాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో JEE Advanced 2026 పరీక్ష కేంద్రాలు ఇవే..
రాజా సాబ్ సినిమా నిర్మాతలకు హైకోర్టు లో ఎదురు దెబ్బ
రాజా సాబ్ సినిమా నిర్మాతలకు హైకోర్టు లో ఎదురు దెబ్బ