AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomatoes: టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి వంట గదిలోనూ కనిపించే అత్యంత సాధారణ కూరగాయ ఇది. కూరల్లో పులుపుకైనా, సలాడ్లలో రుచికైనా దీని తర్వాతే ఏదైనా. మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే చాలామంది చేసే పని ఏంటంటే.. వాటిని శుభ్రంగా కడిగి ఫ్రిజ్‌లో పెట్టేయడం. అప్పుడే తాజాగా ఉంటాయని అలా చేస్తారు.

Tomatoes: టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు
Tomatoess..
Nikhil
|

Updated on: Jan 11, 2026 | 7:30 AM

Share

టమోటాలు చూడటానికి తాజాగా ఉంటాయన్న ఉద్దేశంతో చేసే ఈ చిన్న పని, ఆ పండులో ఉండే అసలైన ఆత్మను చంపేస్తుందని మీకు తెలుసా? అవును, మనం ఫ్రిజ్‌లో పెట్టే టమోటాలు కేవలం ఎర్రటి రంగును మాత్రమే మిగుల్చుకుని, తమ సహజసిద్ధమైన రుచిని, వాసనను కోల్పోతున్నాయి.

సువాసన వెనుక ఉన్న రహస్యం

టమోటా రుచి అనేది కేవలం తీపి లేదా పులుపు మీద మాత్రమే ఆధారపడి ఉండదు. దీని వెనుక వందలాది ‘ఆరోమా కాంపౌండ్స్’ (సువాసన భరిత సమ్మేళనాలు) ఉంటాయి. మనం టమోటాను తింటున్నప్పుడు ముక్కు ద్వారా మనకు తెలిసే ఆ ప్రత్యేకమైన వాసన వల్లే అది రుచిగా అనిపిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, టమోటాలను 4 డిగ్రీల సెల్సియస్ వంటి తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచినప్పుడు, ఈ సమ్మేళనాలను ఉత్పత్తి చేసే రసాయన ప్రక్రియలు నెమ్మదిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆ ప్రక్రియలు పూర్తిగా ఆగిపోతాయి. ఫలితంగా బయటకు పండు నిగనిగలాడుతూ కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం అది చప్పిడి పదార్థంగా మారిపోతుంది.

చాలామంది ఫ్రిజ్‌లో పెట్టిన టమోటాను వండే ముందు కాసేపు బయట ఉంచితే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. ‘ఫ్రాంటియర్స్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఒక వారం కంటే తక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచిన టమోటాలు కొంతవరకు కోలుకోవచ్చు. కానీ వారం దాటితే మాత్రం, వాటిలో ఉండే సువాసన మార్గాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. వాటిని మళ్ళీ గది ఉష్ణోగ్రత వద్దకు తెచ్చినా ఆ పాత రుచి తిరిగి రాదు. అయితే, అన్ని టమోటాలు ఒకేలా స్పందించవు.

హైబ్రిడ్ రకాలతో పోలిస్తే నాటు లేదా ‘హీర్లూమ్’ రకాల్లో చక్కెరలు, సువాసనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో పెడితే నష్టం కూడా ఎక్కువే ఉంటుంది. మార్కెట్‌లో దొరికే వాణిజ్య రకాలను రవాణా సౌలభ్యం కోసం గట్టిగా ఉండేలా పెంచుతారు కాబట్టి, వాటిలో సహజంగానే రుచి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఫ్రిజ్ తోడైతే ఇక ఆ రుచి గురించి చెప్పాల్సిన పని లేదు.

ఎక్కడ నిల్వ చేయాలి?

పండిన టమోటాలను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద (సుమారు 20 డిగ్రీల సెల్సియస్) ఉంచడమే ఉత్తమం. వంటగదిలో ఎండ తగలని చోట ఒక గిన్నెలో భద్రపరుచుకుంటే వాటి రుచి అద్భుతంగా ఉంటుంది. టమోటాలు బాగా పండిపోయి పాడైపోతాయనుకున్నప్పుడు మాత్రమే చివరి ఆప్షన్‌గా ఫ్రిజ్‌ను ఎంచుకోవాలి. అప్పుడు కూడా కొంత రుచిని త్యాగం చేయక తప్పదు. కాబట్టి ఇకపై టమోటా రుచిని ఆస్వాదించాలంటే వాటిని చలి నుండి దూరంగా ఉంచండి.

Follow Us
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?