జామకాయల సీజన్‌లో మార్కెట్లో ఎక్కడ చూసినా రకరకాల జామపండ్లు ఊరిస్తూ కనిపిస్తాయి. జామ శారీరక, మానసిక ఆరోగ్యాలకు ఎంతో మంచిది
TV9 Telugu
ముఖ్యంగా మహిళల పీరియడ్స్ సమయంలో నొప్పి, ఎన్‌టిడి లాంటి సమస్యలున్న మహిళలకు ఎంతో మేలుచేస్తుంది
TV9 Telugu
జామకాయల్లో విటమిన్లు, సోడియం, పొటాషియం, ప్రొటీన్లు దండిగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, ఇబ్బందులకు దివ్యౌషధంలా పనిచేస్తాయి
TV9 Telugu
ఇవి తినడం వల్ల గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఈ పండ్లు మంచిది
TV9 Telugu
అయితే పండిన జామ పండ్లు వీరు తినకూడదు. పచ్చిగా ఉన్నవి తింటే రక్తంలో షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె జబ్బులను అరికడుతుంది
TV9 Telugu
జామలో బి3, బి6 విటమిన్‌లు రక్తాన్ని సాఫీగా సరఫరా చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది
TV9 Telugu
జామ తింటే మీ అందం కూడా రెట్టింపు అవుతుంది. చర్మం మృదువుగా, నునుపు, మెరుపు సంతరించుకుంటుంది
TV9 Telugu
బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు రోజుకొకటి తింటే చాలు. నాజూగ్గా మారిపోతారు. వీటిల్లోని యాంటీ క్యాన్సర్ గుణాలు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కవచంలా పని చేస్తాయి