Telangana: రైతులకు రేవంత్ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. నేటి నుంచే అమల్లోకి మరో కొత్త పథకం!
Telangana Farmer Mechanization Scheme: రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా ఉండేందుకు ‘వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని’ తీసుకొచ్చింది. ఈ పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదగా ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో ఉన్న సన్న, చిన్న కారు రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం పేరుతో రైతులకు ట్రాక్టర్లు, వరికొత మిషన్లను సబ్సిడీ కింద ఇవ్వనుంది. ఇందులో భాగంగానే నేడు భద్రాద్రి కొత్తగూడెం జల్లా అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకాన్ని శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద ఇవాళ రైతులకు రూ.100 కోట్ల వ్యయంతో ట్రాక్టర్లు, వరి కోత మిషన్‌లు, స్ప్రేయర్లను సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకం కింద మహిళా రైతులకు 50శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.
అయితే ఈ పథకం గతంలో అమల్లో ఉండగా.. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం దీన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్లీ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం పెరుగుతున్న కూలీ రేట్లు, కూలీల కొరతను అధిగమించి రైతుకు లబ్ధి చేకూరేందుకు వ్యవసాయ యంత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని.. దీని ద్వారా రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆధాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించగా.. దీని ద్వారా సుమారు 1.30లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
సబ్సిడీలో రైతులకు అందనున్న యంత్రాలు
- ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు
- ఈ పథకం కింద మహిళా రైతులకు కొనుగోలు చేసే యంత్రాలపై 50 శాతం సబ్సిడీ
- ఈ పథకం కింద ఇతర రైతులకు కొనుగోలు చేసే యంత్రాలపై 40 శాతం రాయితీ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
