08 January 2026

కుర్రభామకు రమ్య పసుపులేటికి క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. 

Rajeev 

Pic credit - Instagram

 టాలీవుడ్‌లో కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆకట్టుకుంటున్నారు. 

రమ్య పసుపులేటి. సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నది చాలా క్రేజ్ తెచ్చుకుంది. తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. 

అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టింది.

టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది.

హుషారు సినిమాలో నటించింది ఈ చిన్నది. ఆతర్వాత ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిట్‌మెంట్, మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమాలు చేసింది.

 మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది రమ్య.

ఇక ఈ చిన్నది మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుందని తెలుస్తోంది.