Mucherla Aruna: ఈ సీనియర్ హీరోయిన్ కూతురిని చూశారా.. ? అందంలో అప్సరస.. సినిమాలకు దూరంగా..
అరుణ ముచెర్లా.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్. దక్షిణాదిలో 80వ దశకంలో వరుస సినిమాలతో అలరించిన నటి. చందమామలాంటి కళ్లతో.. చూడచక్కని రూపంతో అప్పట్లో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె తన కూతురితో కలిసి షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది.

80వ దశకంలో సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో అరుణ ముచెర్లా ఒకరు. ఆమె నటించిన సీతాకోకచిలుక సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకున్న అచ్చ తెలుగమ్మాయి ముచ్చర్ల అరుణ. తొలి సినిమాతోనే అందరి చూపును ఆకర్షించింది. 1981లో డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వం వహించి సీతాకోకచిలుక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. ఈ మూవీ హిట్ కావడంతో అరుణ ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె వరుస అవకాశాలు అందుకుంది. చంటబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ గా తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకుంది. దాదాపు పది సంవత్సరాల్లో 70కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ గుప్తను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ఈ దంపతులకు నలుగురు సంతానం. ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్. ఇన్ స్టా, యూట్యూబ్ లో ఎక్కువగా వంటలు, హెల్తీ లైఫ్ స్టైల్, వర్కవుట్స్, ఆర్గానిక్ ఫుడ్స్ గురించి చెబుతూ నెటిజన్లకు దగ్గరవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తన చిన్న కూతురు శోభికకు పుల్కా చేయడం నేర్పిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. అరుణ కూతురిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె అచ్చం తన తల్లిలాగే ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. శోభకి వివాహం 2023లో జరిగింది.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..




