AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రింగు రాజా అవతారం ఎత్తిన రికార్డుల రారాజు.. WWE జాన్ సీనా స్టయిల్లో క్రేజీ గెస్చర్‌

ముంబైతో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లి చేతిలో ప్రత్యేకమైన రింగ్‌తో కనిపించి, జాన్ సీనా స్టైల్‌లో ఇచ్చిన గెస్చర్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ వీడియోను ఆర్సీబీ షేర్ చేయగా, కోహ్లి చేతిలో ఉన్న రింగ్‌ విషయమై నెటిజన్లు ఆసక్తిగా మారారు. టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపుతో భారత జట్టు సభ్యులకు బీసీసీఐ బహుకరించిన ఈ ఛాంపియన్స్ రింగ్‌ బంగారం, వజ్రాలతో తయారైంది. 60 గ్రాముల బరువు, 300 డైమండ్లతో కూడిన ఈ రింగ్‌ను ధరించి కోహ్లి మరోసారి దేశ గర్వాన్ని ప్రతిబింబించాడు.

Video: రింగు రాజా అవతారం ఎత్తిన రికార్డుల రారాజు.. WWE జాన్ సీనా స్టయిల్లో క్రేజీ గెస్చర్‌
Virat Kohli With Ring
Narsimha
|

Updated on: Apr 07, 2025 | 4:01 PM

Share

విరాట్ కోహ్లి తాజాగా తన చేతికి వేసుకున్న స్పెషల్ రింగ్‌ ఇప్పుడు క్రికెట్ అభిమానులలో కుర్రాళ్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు కోహ్లి ఓ ప్రత్యేక రింగ్‌ను ధరించి ఓ శక్తివంతమైన గెస్చర్‌ ఇచ్చాడు. ఆ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తూ, “దీ అనౌరా ఆఫ్ విరాట్ కోహ్లి” అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. కోహ్లి జాన్ సీనా “యూ కాంట్ సీ మీ” స్టైల్‌లో స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు.

ఈ వీడియో వాస్తవానికి అభిమానుల్లో ఆసక్తిని రేపింది కానీ, అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం కోహ్లి చేతిలో ఉన్న ప్రత్యేక రింగ్‌నే. నెటిజన్లు “ఆ రింగ్ ఏంటి?”, “దాని వెనకున్న కథ ఏంటి?” అంటూ తెగ గూగుల్‌లో వెతుకుతున్నారు.

అసలు ఆ రింగ్‌ ప్రత్యేకతేంటి అంటే, ఇది టీ20 వరల్డ్ కప్ 2024 విజేతలైన భారత జట్టు సభ్యులకు బీసీసీఐ బహూకరించిన “ఛాంపియన్స్ రింగ్”. ఫిబ్రవరిలో నిర్వహించిన నమన్ అవార్డుల కార్యక్రమంలో ఈ రింగ్‌లను అందించారు. బంగారంతో తయారై, వజ్రాలతో అద్భుతంగా అలంకరించబడిన ఈ రింగ్ బరువు సుమారు 60 గ్రాములు. ఇందులో దాదాపు 300 డైమండ్లు ఉండగా, అశోక చక్రం డిజైన్‌తో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

విరాట్ కోహ్లి ఈ రింగ్‌ను ముంబైతో మ్యాచ్‌కు ముందు ధరించి, “వాంఖడేలో స్పెషల్ ఇన్నింగ్స్ లోడింగ్” అని సందేశం ఇచ్చినట్టయింది. ఈ స్మారక రింగ్ ద్వారా దేశ గర్వాన్ని మళ్లీ గుర్తుచేసిన కోహ్లి, అభిమానుల గుండెల్లో మరింత దగ్గరయ్యాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుస విజయాలతో మంచి ఫామ్ లోకి వచ్చినప్పటికి.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ఐకానిక్ వాంఖడే స్టేడియంలో విజయాల బాట పట్టాలని చూస్తోంది.

MI vs RCB ప్రాబబుల్ ప్లేయింగ్ XIలు..

ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, రాజ్ బావా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్.

ఇంపాక్ట్ ప్లేయర్: తిలక్ వర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కీపర్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.

ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలాం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ