Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మరోసారి అయ్యర్‌ను ఎంత క్యూట్‌గా ఇమిటేట్‌ చేశాడో చూడండి! ఈ సారి స్పెషల్‌ రిక్వెస్ట్‌పై..

పంజాబ్ కింగ్స్ యువ క్రికెటర్ ముషీర్ ఖాన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను అద్భుతంగా అనుకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కోరిక మేరకు ఈ అనుకరణ జరిగింది. ముషీర్ ఖాన్ యొక్క అద్భుతమైన అనుకరణకు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో మంచి ప్రారంభం చేసింది.

Video: మరోసారి అయ్యర్‌ను ఎంత క్యూట్‌గా ఇమిటేట్‌ చేశాడో చూడండి! ఈ సారి స్పెషల్‌ రిక్వెస్ట్‌పై..
Musheer Khan
Follow us
SN Pasha

|

Updated on: Apr 07, 2025 | 1:06 PM

ఓ వైపు ఐపీఎల్‌ 2025 సీజన్‌ హోరాహోరీగా సాగుతుండగా.. మరోవైపు కొన్ని ఫన్నీ ఫన్నీ థింగ్స్‌ కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలె పంజాబ్‌ కింగ్స్‌ యంగ్‌ క్రికెటర్‌ ముషీర్‌ ఖాన్‌, ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అయ్యర్‌ను అతని ముందే డ్రెస్సింగ్‌ రూమ్‌లో సూపర్‌గా ఇమిటేట్‌ చేశాడు. ఇప్పుడో ఓ స్పెషల్‌ ప్లేయర్‌ స్పెషల్‌ రిక్వెస్ట్‌పై మరోసారి గ్రౌండ్‌లో అంతే క్యూట్‌గా ఇమిటేట్‌ చేశాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అయ్యర్‌ను ఇమిటేట్‌ చేయమని ముషీర్‌ ఖాన్‌ను కోరింది ఎవరో కాదు.. రాజస్థాన్‌ రాయల్స్‌ యంగ్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌. శనివారం పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ముషీన్‌ ఖాన్‌తో జైస్వాల్‌ సరదాగా ముచ్చటించాడు.

ఈ క్రమంలోనే ఒక్కసారి అయ్యర్‌ను ఇమిటేట్‌ చేయాల్సిందిగా రిక్వెస్ట్‌ చేశాడు. జైస్వాల్‌ కోరిక మేరకు ముషీర్‌ అయ్యర్‌లా నడుస్తూ.. చాలా క్యూట్‌గా ఇమిటేట్‌ చేశాడు. అచ్చం అయ్యర్‌ను దించేశాడు. ఈ వీడియోకు క్రికెట్‌ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. బ్యాట్‌తోనే కాదు బాడీ లాంగ్వేజ్‌తోనూ ముషీర్‌ అదరగొట్టేస్తున్నాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా, ముషీర్‌ ఖాన్‌ను ఐపీఎల్‌ మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఇంకా ముషీర్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడే ఛాన్స్‌ రాలేదు. ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్ సూపర్‌ స్టార్ట్‌ అందుకుంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ.. అంతకంటే ముందు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో పటిష్టంగానే ఉంది. కొత్త కెప్టెన్‌ అయ్యర్‌ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..