AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Hema: ఆ సమయంలో అతడ్ని చంపేద్దామనుకున్నా.. కానీ.! నటి హేమ సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ నటి హేమపై ఇటీవల డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ అంశంపై తాజాగా హేమ కీలక వ్యాఖ్యలు చేసింది. డ్రగ్ టెస్టులో నెగిటివ్ వచ్చిందని, అసలు ఆరోపణల వెనుక కొందరు వ్యక్తులు ఉన్నారని ఆమె తెలిపింది. ఆ వివరాలు..

Actress Hema: ఆ సమయంలో అతడ్ని చంపేద్దామనుకున్నా.. కానీ.! నటి హేమ సంచలన వ్యాఖ్యలు..
Hema
Ravi Kiran
|

Updated on: Dec 28, 2025 | 11:22 AM

Share

టాలీవుడ్ నటి హేమ ఇటీవల డ్రగ్స్ ఆరోపణల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో మంచి పేరున్నప్పటికీ.. తనను కావాలనే కొందరు ఇలాంటి కేసులో ఇరికించారని ఆరోపించింది. పలు యూట్యూబ్ ఛానెళ్లు తనను ట్రోల్ చేశాయని, అయితే అది జెన్యూన్ ప్రేక్షకులు చేసింది కాదని ఆమె స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఫేక్ ఐడీలతో తనపై దుష్ప్రచారం చేశారని, వారిని తాను ఎంక్వైరీ ద్వారా గుర్తించానని తెలిపింది.

తనకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని మొదటిసారి న్యూస్ వచ్చినప్పుడు వెంటనే తన ఫోన్‌తో ఇంట్లోనే ఒక వీడియో షూట్ చేసి విడుదల చేశానని హేమ వెల్లడించింది. “ఇవన్నీ నా బాడీలోనే ఉంటాయి కదా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. టెస్టులు చేపించండి. హెయిర్‌లో ఏడాది పాటు డ్రగ్స్ ఆనవాళ్లుంటాయి” అని ఆ వీడియోలో తాను చెప్పానని పేర్కొంది. ఆ తర్వాత పోలీసులు తనకు టెస్టులు చేయించారని చెప్పింది. తన హెయిర్, నెయిల్స్ అన్నీ టెస్ట్ చేసి పంపారని, వాటిల్లో నెగిటివ్ వచ్చిందని ఆమె తెలిపింది. అంతకుముందే తాను సొంతంగా టెస్టులు చేయించుకుని, యూట్యూబ్‌లో పెట్టానని, “నా టెస్టులు నమ్మొద్దు, పోలీసుల టెస్టులు కూడా నమ్మకండి. మీరే వచ్చి నాకు టెస్టులు చేపించండి, తెలిసిపోతుంది” అని సవాల్ చేశానని హేమ వివరించింది.

కొందరు వ్యక్తులు తన గురించి తప్పుడు వార్తలు రాశారని, గతంలో తాను లేని అంశంలోనూ తన పేరును ప్రస్తావించారని ఆమె ఆరోపించింది. ఒక అసిస్టెంట్ ఫోన్ చేసి అడిగినప్పుడు, తన శరీరంలో డ్రగ్స్ ఉంటే కాళ్లు పట్టుకుంటానని, లేదంటే తనపై దుష్ప్రచారం చేసినవారు ఏం చేస్తారో ఆలోచించుకోవాలని హెచ్చరించానని తెలిపింది. తన వద్ద మొత్తం 300 కాల్ రికార్డులు, స్క్రీన్ రికార్డులు, వాయిస్ రికార్డులు ఉన్నాయని, వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానంది. “వీళ్ళు గనక అన్నీ కరెక్ట్‌గా చేయకపోతే నేను కోర్టులో చూసుకుంటాను” అని స్పష్టం చేశాను. తాను తప్పు చేయలేదు కాబట్టి కేసు గెలుస్తానన్న నమ్మకం ఉందని హేమ ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఫిట్‌నెస్ లేక పక్కకు తప్పుకున్న హార్దిక్
ఫిట్‌నెస్ లేక పక్కకు తప్పుకున్న హార్దిక్
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..