Tollywood : అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు రూ.2000 కోట్లకు యజమాని..
ప్రస్తుతం ఆమె రూ.2000 కోట్ల విలువైన కంపెనీలకు యజమాని. కానీ మీకు తెలుసా.. ? ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. 16 ఏళ్లకే కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ స్టార్ డమ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఒకప్పుడు తెలుగులో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేస్తుండగా.. మరికొందరు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరవుతున్నారు. నిత్యం తమ ఫ్యామిలీ, పర్సనల్ విషయాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె రూ. 2000 కోట్లకు యజమాని. ఆమె 90వ దశకంలో కుర్రవాళ్ల కలల రాకుమారి. 15 ఏళ్లకే నటిగా మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.1993లో రాజేంద్ర ప్రసాద్ నటించి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రంభ. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె.. తనదైన ముద్ర వేసింది.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. అల్లు అర్జున్ నటించిన దేశముదురు చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. కెరీర్ ఫాంలో ఉండగానే 2010లో ఇంద్రకుమార్ అనే కెనెడియన్ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విదేశాల్లో నివసిస్తుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.
తాజాగా ఆమె తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయగా.. అందులో ఆమె కూతురు మరింత హైలెట్ అయ్యింది. అందంలో అచ్చం అమ్మలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇదెలా ఉంటే.. రంభ భర్త వ్యాపారవేత్త. అతడికి దాదాపు రూ.2000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అతడు కెనడాలో పలు కంపెనీలు నిర్వహిస్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్, ఫుడ్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టారు. అవకాశం వస్తే రంభ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..

Rambha New
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
