AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం.. మీ అదృష్టాన్ని మార్చే..

ఆఫీసులో మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవాలా..? కేవలం కష్టం మాత్రమే కాదు, మీ డెస్క్‌పై ఉండే ఈ చిన్న చిన్న మార్పులు కూడా మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తాయి. వాస్తు, ఫెంగ్ షూయ్ సూత్రాల ఆధారంగా మీ పని ప్రదేశంలో సానుకూలతను పెంచే అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం.. మీ అదృష్టాన్ని మార్చే..
Office Desk Vastu Tips
Krishna S
|

Updated on: Dec 28, 2025 | 11:08 AM

Share

చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన గుర్తింపు రావడం లేదని బాధపడుతుంటారు. అయితే మన పనితీరు వెనుక మనం గడిపే వాతావరణం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తు, ఫెంగ్ షూయ్ ప్రకారం.. మీ ఆఫీస్ డెస్క్‌పై కొన్ని వస్తువులను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరిగి, అదృష్టం మీ తలుపు తడుతుంది. ఆ అదృష్ట వస్తువులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..

పచ్చని మొక్కలు

మీ డెస్క్‌పై చిన్నపాటి మొక్కలను ఉంచడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు, తాజాదనం కూడా వస్తుంది. మనీ ప్లాంట్, వెదురు మొక్కలు శ్రేయస్సు, ఆర్థిక పురోగతికి చిహ్నాలు. కలబంద గాలిని శుద్ధి చేయడమే కాకుండా ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ప్రతిరోజూ ఈ మొక్కలను చూసుకోవడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడి పనిపై ఆసక్తి పెరుగుతుంది.

స్ఫటికాలు

పనిలో ఏకాగ్రత కుదరడం లేదా? అయితే మీ డెస్క్‌పై చిన్న క్వార్ట్జ్ రాళ్లను లేదా స్ఫటికాలను ఉంచండి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, క్లిష్ట సమయాల్లో కూడా స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. టీమ్ వర్క్‌లో మంచి వాతావరణం ఏర్పడటానికి ఇవి ఎంతో తోడ్పడతాయి.

ఇవి కూడా చదవండి

ఆర్థిక వృద్ధికి చిన్న చిహ్నాలు

డెస్క్ ఈశాన్య దిశలో చిన్న డబ్బు సంచి లేదా ఆర్థిక చిహ్నాన్ని ఉంచడం అదృష్టంగా చెప్తారు. ఇది మీకు వచ్చే ఆదాయ మార్గాలను మెరుగుపరచడమే కాకుండా కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే స్ఫూర్తినిస్తుంది.

వ్యక్తిగత స్పర్శ – స్ఫూర్తి

మీ కుటుంబ సభ్యుల ఫోటోలు లేదా మీకు ఇష్టమైన ప్రేరణాత్మక కోట్‌లను డెస్క్‌పై ఉంచండి. పనిలో విసుగు కలిగినప్పుడు లేదా అలసిపోయినప్పుడు, ఇవి మీలో మళ్లీ ఉత్సాహాన్ని నింపుతాయి.

పనిలో విజయం సాధించాలంటే ఇవి కూడా తప్పనిసరి!

కేవలం వస్తువులే కాకుండా మీ అలవాట్లు కూడా మీ విజయానికి బాటలు వేస్తాయి..

పరిశుభ్రతే ప్రాణం: చిందరవందరగా ఉండే డెస్క్ మనసును అయోమయానికి గురిచేస్తుంది. ఎప్పుడూ మీ డెస్క్‌ను శుభ్రంగా, నీట్‌గా ఉంచుకోండి.

స్మాల్ బ్రేక్స్: ప్రతి గంటకోసారి రెండు నిమిషాలు నడవడం లేదా శరీరాన్ని సాగదీయడం చేయండి. ఇది మీ మెదడును రిఫ్రెష్ చేస్తుంది.

నీరు – పోషకాహారం: తగినంత నీరు తాగడం, జంక్ ఫుడ్‌కు బదులుగా డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారం తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు.

పనుల ప్రాధాన్యత: రోజు మొదట్లోనే ముఖ్యమైన పనులను గుర్తించి వాటిని పూర్తి చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అదృష్ట వస్తువులు మీకు సానుకూల వాతావరణాన్ని అందిస్తాయి. కానీ మీ కష్టమే మీ అసలైన విజయం. మీ హార్డ్ వర్క్‌కి ఈ చిన్న చిన్న వాస్తు చిట్కాలను తోడు చేయండి.. విజయం మీ సొంతం చేసుకోండి..

ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!