Sundeep Kishan: సందీప్ కిషన్ బంపరాఫర్.. ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. ఇలా చేస్తే మీకు కూడా..
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. మూవీ లవర్స్ కోసం ఉచితంగా మూవీ టికెట్లు అందిస్తానన్న ఈ హీరో సినిమా చూసిన ఆడియెన్స్ తన రెస్టారెంట్ లో కడుపు నిండా భోజనం చేసేలా ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు.

క్రిస్మస్ సందర్భంగా తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. రోషన్ ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంభాల, శివాజీ దండోరా, ఈషా, పతంగ్, బ్యాడ్ గర్ల్స్, పతంగ్ ఇలా దాదాపు అరడజను సినిమాలు ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. దాదాపు అన్ని సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే వస్తున్నాయి. అయితే ఇందులో పతంగ్ మూవీ చాలా డిఫరెంట్ గా ఉంది. హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతిని, గాలిపటాల పండుగ నేపథ్యంలో సాగే ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం థియేటర్లకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమా అయిన పతంగ్ ను మరింత ప్రమోట్ చేసేందుకు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ముందుకొచ్చాడు. ఈ మూవీ చూసే వారికోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. అదేంటంటే.. పతంగ్ చూసేందుకు తానే స్వయంగా 500 టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించాడు.
ఉచిత టికెట్లత పాటు మూవీ లవర్స్ కు మరో ఆఫర్ కూడా ఇచ్చాడు సందీప్. అదేంటంటే.. సినిమా చూసిన ఆడియెన్స్ కడుపునిండా భోజనం చేసేందుకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు.. ‘పతంగ్’ సినిమా టికెట్ చూపించిన వారికి తెలుగు రాష్ట్రాల్లోని అతడి ప్రసిద్ధ ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్లలో బిల్లుపై 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభించనున్నట్లు తెలిపాడు. సినిమా చూసిన ప్రేక్షకులు ఫిజికల్ టికెట్ లేదా ఆన్‌లైన్ బుకింగ్ స్క్రీన్ షాట్ చూపిస్తే చాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
సినిమా టికెట్లు చూపిస్తే చాలు..
Giving away 500 tickets for #Patang the film,with love for this Adorable/Passionate Team 🧿@PranavKaushikk @VPujit @Preethipagadal @praneethdirects
Hearing Fab Things about the film..Please go check it out in Theatres now ♥️
For tickets : pls contact @adithyamerugu pic.twitter.com/EbmBbRbAtI
— Sundeep Kishan (@sundeepkishan) December 27, 2025
శంభాలకు కూడా..
పతంగ్ తో పాటు ఆది సాయికుమార్ నటించిన శంబాల సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్లలో భోజనం చేస్తే వారికి 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభించనున్నట్లు సందీప్ తెలిపాడు. మొత్తానికి చిన్న సినిమాల కోసం సందీప్ తీసుకున్న నిర్ణయంపై సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
I always believe in supporting small films that come with big heart ❤️ Great initiative — 500 free tickets for Patang 👏🎬#Patang pic.twitter.com/o4LwVNohX2
— Anbu Raj (@Catch_anbu) December 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




