Chahal Dhanashree : విడిపోయిన 11 నెలల తర్వాత మళ్లీ కలవబోతున్న చాహల్, ధనశ్రీ
Chahal Dhanashree : అతి త్వరలో ప్రారంభం కానున్న ది 50 అనే సరికొత్త రియాలిటీ షోలో స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ కలిసి కనిపించబోతున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ షోలో వీరిద్దరూ కంటెస్టెంట్లుగా రాబోతున్నారట.

Chahal Dhanashree : టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని మాజీ భార్య ధనశ్రీ వర్మల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ క్రేజీ కపుల్ విడిపోయి అభిమానుల మనసు గాయపరిచినప్పటికీ, ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ ఒకే వేదికపైకి రాబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న 11 నెలల తర్వాత వీరిద్దరి రీయూనియన్ జరగబోతుండటంతో బుల్లితెరపై తలపడనున్న ఈ జంట కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజా నివేదికల ప్రకారం.. అతి త్వరలో ప్రారంభం కానున్న ది 50 అనే సరికొత్త రియాలిటీ షోలో యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ కలిసి కనిపించబోతున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ షోలో వీరిద్దరూ కంటెస్టెంట్లుగా రాబోతున్నారట. మేకర్స్ ఇంకా అధికారిక లిస్టును ప్రకటించనప్పటికీ, విడిపోయిన ఈ జంటను ఒకే చోట చూడటం వల్ల షో రేటింగ్స్ ఎక్కడికో వెళ్తాయని భావిస్తున్నారు. ఈ షో ఫిబ్రవరి 1 నుంచి రాత్రి 9 గంటలకు జియో హాట్‌స్టార్‌లో, ఆ తర్వాత 10:30 గంటలకు కలర్స్ ఛానల్‌లో ప్రసారం కానుంది.
చాహల్, ధనశ్రీల పరిచయం 2020 లాక్‌డౌన్ సమయంలో మొదలైంది. అదే ఏడాది డిసెంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ధనశ్రీ తన డ్యాన్స్ వీడియోలతో ఎంత పాపులర్ అయిందో, చాహల్ వికెట్ తీసినప్పుడు గ్యాలరీలో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు అంతకంటే ఎక్కువ వైరల్ అయ్యేవి. అయితే ఏమైందో ఏమో కానీ, 2024లో వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చివరికి మార్చి 2025లో ఈ జంట చట్టబద్ధంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి ఏ వేదికపైన కనిపించలేదు.
ధనశ్రీతో విడిపోయిన తర్వాత చాహల్ పేరు ఆర్జే మహ్వాష్ తో వినిపిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో మహ్వాష్ స్టేడియానికి రావడం, చాహల్ టీమ్‌ను ఉత్సాహపరచడం చూస్తుంటే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు చాహల్ కెరీర్ విషయానికి వస్తే.. భారత్ తరపున 72 వన్డేలు, 80 టీ20లు ఆడిన అతను 200లకు పైగా వికెట్లు తీశాడు. 2023 ఆగస్టు తర్వాత అతను మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. మరి ఇప్పుడు రియాలిటీ షో ద్వారా చాహల్ తన వ్యక్తిగత విషయాలను ఏమైనా బయటపెడతాడేమో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
