Rohit Sharma: ఇకపై ఫిట్‌మ్యాన్‌గా హిట్‌మ్యాన్.. మరింత స్లిమ్‌గా రోహిత్ భయ్యా.. ఎందుకో తెలుసా..!
Rohit Sharma: వయస్సు పెరుగుతున్నప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్ వరకు తన కెరీర్‌ను కొనసాగించాలని రోహిత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆటలో మరింత వేగం, చురుకుదనం కోసం తన ఫిట్‌నెస్‌పై మరింత కఠినంగా దృష్టి సారిస్తున్నాడు. రోహిత్ శర్మ ఈ అంకితభావం యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.

Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ విషయంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు ముందు 11 కిలోల బరువు తగ్గించుకుని, లీనర్‌గా, ఫిట్టర్‌గా మారిపోయాడు. ఈ అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక మాజీ కోచ్ అభిషేక్ నాయర్ సహకారం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఫ్యాన్స్ జెర్సీ నెంబర్ 45 ‘టార్గెట్ 2027’ లోడ్ అవుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘హిట్‌మ్యాన్’ ఫిట్‌నెస్ మంత్రం..
రోహిత్ శర్మ దాదాపు 3 నెలల పాటు నిర్విరామంగా కఠిన శిక్షణ తీసుకున్నాడు. ఇందులో బాడీబిల్డర్ తరహా హై-రెపిటేషన్ వర్కవుట్‌లు, క్రాస్‌ఫిట్ శిక్షణ ఉన్నాయి.
ప్రతి కండరాల సమూహం కోసం 700 నుంచి 800 రెపిటేషన్లు చేసేవాడు. ముఖ్యంగా ముంబైలోని తన ఇష్టమైన వడాపావ్‌కు దూరంగా ఉండటంతోపాటు, కఠినమైన ఆహార నియమాన్ని పాటించాడు.
ఈ కృషి ఫలితంగా ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో అతని బ్యాటింగ్ మరింత మెరుగైంది. సిడ్నీలో అద్భుతమైన సెంచరీతో (121 నాటౌట్) రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌పై దృష్టి..
తాజా సమాచారం ప్రకారం, రోహిత్ శర్మ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఆగదలచుకోలేదంట. అతని బాల్య స్నేహితుడు, మెంటర్ అభిషేక్ నాయర్ ఒక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ, “రోహిత్ తన ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేశాడు. దాని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. నాటికల్లా అతను మరికొన్ని కిలోల బరువు తగ్గినట్లయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు” అని తెలిపారు.
వయస్సు పెరుగుతున్నప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్ వరకు తన కెరీర్‌ను కొనసాగించాలని రోహిత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆటలో మరింత వేగం, చురుకుదనం కోసం తన ఫిట్‌నెస్‌పై మరింత కఠినంగా దృష్టి సారిస్తున్నాడు. రోహిత్ శర్మ ఈ అంకితభావం యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








