Paneer vs Eggs: పన్నీర్ Vs కోడిగుడ్డు వీటిల్లో ఏది ఆరోగ్యానికి బెటరూ తెలుసా?
శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే అనేక రకాలైన విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, హెల్దీ ఫ్యాట్స్ అవసరం. వీటిల్లో ఏది తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అన్నీ సమతుల్యంగా ఉండాలి. అప్పుడే బాడీ ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. శరీరాన్ని హెల్దీగా ఉంచేలా చేయడంలో గుడ్లు, పన్నీరు కూడా హెల్ప్ చేస్తాయి. గుడ్లు, పన్నీర్‌లో ఎక్కువగా..

శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే అనేక రకాలైన విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, హెల్దీ ఫ్యాట్స్ అవసరం. వీటిల్లో ఏది తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అన్నీ సమతుల్యంగా ఉండాలి. అప్పుడే బాడీ ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. శరీరాన్ని హెల్దీగా ఉంచేలా చేయడంలో గుడ్లు, పన్నీరు కూడా హెల్ప్ చేస్తాయి. గుడ్లు, పన్నీర్‌లో ఎక్కువగా క్యాల్షియం, ప్రోటీన్ లభిస్తుంది. అదే విధంగా ఇతర పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. అయితే వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది ఎక్కువగా తీసుకుంది బెటర్? ఈ రెండింటిలో పోషకాలు ఎందులో ఉన్నాయి? వీటిల్లో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో.. నిపుణులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లు:
నిత్యవసర సరుకుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. కోడి గుడ్లను మనం వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటాం. ఎక్కువగా గుడ్లనే తింటూ ఉంటారు. అలాగే ప్రతీ రోజూ ఓ కోడి గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఎక్కువగా ప్రోటీన్, క్యాల్షియం మెండుగా లభిస్తాయి. అలాగే విటమిన్ డి, విటమిన్ బి12, అయోడిన్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఏ ఉంటాయి. అదే విధంగా ఫ్యాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్లు మెండుగా ఉంటాయి. అందుకే బరువు తగ్గేవారు గుడ్డులోని వైట్ మాత్రమే తినమని వైద్యులు చెబుతారు. గుడ్లను ఎవరైనా తినవచ్చు.
పన్నీర్:
వెజిటీరియన్స్ ఎక్కువగా తినే ఆహార పదార్థాల్లో పన్నీర్ కూడా ఒకటి. వాళ్లకు ఇదే బెస్ట్ ఫుడ్. పన్నీర్‌తో కూడా అనేక రకాలైన వంటలు తయారు చేసుకోవచ్చు. చాలా మంది పన్నీర్ ఇష్ట పడి తింటూ ఉంటారు. గుడ్లతో పోలిస్తే దీని ఖరీదు కాస్త ఎక్కువ. పన్నీర్‌లో విటమిన్ బి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్, 6 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. పన్నీర్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. పన్నీర్ కూడా ఎవరైనా తినవచ్చు.
ఈ రెండింటిలో ఏది బెస్ట్:
పన్నీర్, గుడ్డు ఈ రెండూ ఆరోగ్యకరమైన పదార్థాలే. ఈ రెండు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పలు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అయితే గుడ్డులో పన్నీర్ కంటే కొంచెం ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రెండూ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే గుడ్డు కంటే పన్నీర్ ఖరీదు ఎక్కువ. అలాగే కల్తీ కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి పన్నీర్ చెక్ చేసుకుని తీసుకోవడం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








