Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా..? డోంట్ వర్రీ.. ఒకసారి ఇది ట్రై చేయండి..
ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. ఈ బరువును తగ్గించుకొని స్లిమ్‌గా కనిపించాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెళ్లడం, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం చేస్తున్నారు. కానీ పూర్తి పరిష్కారాన్ని పొందలేక పోతున్నారు. కానీ మన ఇంటి పరిసరాల్లో లభించే కొన్ని వస్తులతో ఈజీగా మనం కొవ్వును కరిగించొచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి.. బరువుతు తగ్గించుకోవడానికి సులభమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అందరి వంటగదిలో సులభంగా లభించే మెంతులు బరువు తగ్గడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. మెంతి గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే, ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఫైబర్‌తో పాటు, మెంతి గింజల్లో రాగి, రిబోఫ్లేవిన్, విటమిన్లు ఎ, బి6, సి, కె కూడా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి మన శరీరంలోని కొవ్వును కరిగించేందుకు ఎంతగానో దోహదపడుతాయి.
బరువు తగ్గించేందుకు మెంతులు ఎలా సహాయపడుతాయి
మెంతు వాటర్: మెంతుల గింజలను వేడి నీటిలో నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. మొలకెత్తిన మెంతుల గింజలను కూడా మనం సలాడ్‌గా తినవచ్చు. అంతేకాదు మెంతుల గింజలను రాత్రిపూట నానబెట్టి ఉదయం వాటి నీరు త్రాగడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. ఇలా తాగడం ద్వారా మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పసుపు, మెంతు గింజలపొడి: పసుపుతో పాటు మెంతుల పొడిని తీసుకోవడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు, పసుపులోని శోథ నిరోధక ప్రభావాలు మెంతులతో కలిసి జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఈ మెంతుపొడిని భోజనం, పెరుగు లేదా స్మూతీలలో కలుపుకొని మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఇది శరీరానికి అదనపు ఫైబర్‌ను అందిస్తుంది. అలాగే బరువు నియంత్రణలో ఉంచుతుంది.
మెంతు గింటల గ్రీన్‌టీ: మెంతి గింజలను గ్రీన్ టీతో కలిపి తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతి పొడిని కొద్దిగా తేనెతో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మెంతి పొడిని నిమ్మరసం, నీటితో కలిపి తాగితే అది శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. మీకు రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




