హైదరాబాద్ టూ రామప్ప.. ఈ వీకెండ్ టూర్‌కి క్రేజీ ప్యాకేజ్..
Prudvi Battula
Images: Pinterest
16 December 2025
'హైదరాబాద్-వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్' పేరుతో ఓ సరి కొత్త వీకెండ్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం.
హైదరాబాద్-వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్
ఈ టూర్ మొత్తం ఏసీ మినీ కోచ్ బస్సులో రెండు రోజుల పాటు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
ప్రతి శనివారం
ఈ టూర్ ప్యాకేజీ ధరల పెద్దలకు 3,449రూపాయలు, పిల్లలకు 2,759 రూపాయలుగా నిర్ణయించింది తెలంగాణ టూరిజం సంస్థ.
ప్యాకేజీ ధరలు
మొదటిరోజు (శనివారం) ఉదయం 7:00 గంటలకు హైదరాబాద్ మొదలై 8:30 గంటలకు భువనగిరి ఫోర్ట్ చూసి యాదగిరిగుట్టకు బయల్దేరుతారు.
భువనగిరి ఫోర్ట్
9:00 గంటలకు యాదాద్రి చేరుకొని హరిత హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి 9:45 గంటలకు యాదాద్రి దర్శనం చేసుకొని 10:30 గంటలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు.
యాదాద్రి దర్శనం
11:00 నుంచి 11:30 AM వరకు జైన దేవాలయం సందర్శన తర్వాత మధ్యాహ్నం 12:00 గంటలకు హస్తకళలకు ప్రసిద్ధి చెందిన పెంబర్తిలో షాపింగ్ చేసుకోవచ్చు.
జైన దేవాలయం
ఆపై 1:30 గంటలకు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌కి చేరుకొని 4:00 PM వరకు చెక్-ఇన్, భోజన విరామం, విశ్రాంతి ఉంటుంది.
హన్మకొండ
4:00 PM నుంచి 8:30 PM వరకు వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయంతో పాటు వరంగల్ ఫోర్ట్ సౌండ్ & లైట్ షో చూస్తారు.
వరంగల్
9:00 గంటలకు హోటల్‌కి వచ్చి నైట్ డిన్నర్, బస చేసి రెండోరోజు (ఆదివారం) ఉదయం టిఫిన్ చేసి 8 గంటలకు రామప్ప టెంపుల్‌కు బయల్దేరుతారు.
రామప్ప టెంపుల్
10:00 AM నుంచి 1:00 PM మధ్యలో రామప్ప ఆలయం, బోటింగ్, భోజనం తర్వాత 2 గంటలకు లక్నవరం వెళ్లి 3 గంటల వరకు బోటింగ్ సహా లక్నవరం సందర్శన ఉంటుంది.
రామప్ప ఆలయం, బోటింగ్
సాయంత్రం 5:00 గంటలకు హన్మకొండలోని హరిత హోటల్‌లో టీ, స్నాక్స్ బ్రేక్ తర్వాత 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో టూర్ ముగుస్తుంది.
సికింద్రాబాద్‌లో టూర్ ముగుస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలాంటి జాబ్స్ ఎంచుకున్నారంటే.. మీన రాశివారికి తిరుగులేదట..
మీకు నచ్చేలా.. అందరు మెచ్చేలా.. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చెయ్యాలంటే.?
ఒకేలాంటి చేపల కూర బోర్ కొడుతుందా.? ఈ డిఫరెంట్ రెసిపీలు ట్రై చెయ్యండి..