కేరళ స్పెషల్.. ప్రాన్ కరువాడు చమ్మంతి రెసిపీ.. ఇలా చేయాలంటే.?

Prudvi Battula 

Images: Pinterest

16 December 2025

ఎండిన రొయ్యలు - అర కప్పు; కొబ్బరి తురుము - 1 కప్పు; అల్లం - 1 అంగుళం; కరివేపాకు - చిటికెడు; కారం - 1 టీస్పూన్; వెల్లుల్లి - 3 లవంగాలు; ఉప్పు - రుచికి సరిపడా

పదార్థాలు

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్‌ పెట్టి అందులో ఎండిన రొయ్యలను వేయిస్తూ తక్కువ మంట మీద కొద్దిసేపు అలానే ఉంచండి.

ఎండిన రొయ్యలు వేయించాలి

ఎండిన రొయ్యలను క్రిస్పీగా అయ్యే వరకు తక్కువ మంటపైనే వేయించాలి. తర్వాత వీటిని మిక్సర్ జార్‌లోకి మార్చండి.

రొయ్యలను క్రిస్పీగా చెయ్యండి

అందులో తురిమిన కొబ్బరి, అల్లం, కరివేపాకు కూడా వేయండి. తరువాత, కారం పొడి, వెల్లుల్లి పొడి, అవసరమైన మొత్తంలో ఉప్పు వేయండి.

తురిమిన కొబ్బరి, అల్లం, కరివేపాకు

తరువాత అందులో అవసరమైనంత నీరు పోసి వీటన్నింటిని పేస్ట్‎లా రుబ్బుకోవాలి. అయితే ఇది మరి మెత్తగా రుబ్బుకోకూడదు.

పేస్ట్‎లా రుబ్బుకోవాలి

ఈ మిశ్రమాన్ని గుండ్రంగా మీకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టండి. అంతే రుచికరమైన ప్రాన్ కరువాడు సమ్మంతి సిద్ధం.

గుండ్రంగా ఉండలుగా చుట్టండి

దీన్ని అన్నం, గంజితో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎంతో నచ్చుతుంది. మీరు కూడా ట్రై చెయ్యండి.

వడ్డించే పద్ధతి

ప్రోటీన్, జింక్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కండరాల ఆరోగ్యం, మెదడు, ఎముక, రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది.

ప్రయోజనాలు