Sugar Control Tips: షుగర్ ఉన్నవారు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
డయాబెటీస్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికీ తెలుసు. చాప కింద నీరులా ప్రవహిస్తుంది. ముందుగానే దీన్ని గుర్తించక పోతే మాత్రం దీర్ఘకాలికంగా మాత్రం పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేకపోలేదు. బాడీలో చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగి పోయి.. చివరికి ప్రాణాల మీదకు వస్తుంది. ముఖ్యంగా చలి కాలంలో డయాబెటీస్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా.. బాడీలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చలి కాలంలో తీసుకునే ఆహార విషయంలో, లైఫ్ స్టైల్ లో ఖచ్చితంగా మార్పులు..
డయాబెటీస్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికీ తెలుసు. చాప కింద నీరులా ప్రవహిస్తుంది. ముందుగానే దీన్ని గుర్తించక పోతే మాత్రం దీర్ఘకాలికంగా మాత్రం పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేకపోలేదు. బాడీలో చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగి పోయి.. చివరికి ప్రాణాల మీదకు వస్తుంది. ముఖ్యంగా చలి కాలంలో డయాబెటీస్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా.. బాడీలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చలి కాలంలో తీసుకునే ఆహార విషయంలో, లైఫ్ స్టైల్ లో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాల్సిందే. మరి ఆ చిట్కాలు ఏంటి? ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడిని తగ్గించుకోవాలి:
డయాబెటీస్ తో ఉన్నవారు ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, భయం వంటివి తగ్గించు కోవాలి. షుగర్ ఉన్న వారిలో ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శీతా కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువ అయితే షుగర్ లెవల్స్ అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి.
హెల్దీ ఫుడ్ తీసుకోవాలి:
డయాబెటీస్ ఉన్నవారు వింటర్ సీజన్ లో తప్పకుండా ప్రోటీన్స్, విటమిన్లు, ఫైబర్ ఉన్నటువంటి ఆహారాలను తీసుకోవాలి. ప్రోటీన్స్, ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకుంటే ఆకలిని తగ్గించి.. జీవ క్రియను మెరుగు పరుస్తాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలులు అనేవి పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. షుగర్ ఉన్న వారు చలి కాలంలో ఆహారాన్ని ముందే తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో సూర్య కాంతి అనేది తక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ క్రియ అనేది నెమ్మదిగా సాగుతుంది. అలాగే పండ్లు, పచ్చి కూరగాయలు, తృణ ధాన్యలు అనేవి సాయంత్రం కంటే ముందే తీసుకోవాలి.
ఖచ్చితంగా వ్యాయామం చేయాలి:
డయాబెటీస్ ఉన్న వారు ఖచ్చితంగా వింటర్ సీజన్ లో వ్యాయామం చేయాలి. లేదంటే శరీర బరువు అనేది పెరిగి పోతుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఉదయం లేదా సాయంత్రం ఎక్సర్ సైజ్ లు చేయండి. వాకింగ్, యోగా వంటివి చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవడం వల్ల.. షుగర్ లెవల్స్ పై ప్రభావం పడదు.
పొగ మంచుకు దూరంగా ఉండాలి:
మధు మేహం ఉన్నవారికి సాధారణంగా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వీరు చలికి, పొగ మంచుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువ అవుతాయి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.