Remedies for Back Pain: నడుము నొప్పితో బాధపడుతున్నారా.. పాలు ఇలా తాగితే సెట్ అవుతుంది!
సాధారణంగా చాలా మంది మహిళలు నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలి కాలంలో ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. కేవలం నడుము నొప్పి మాత్రమే కాకుండా కొందరికి మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇలా నొప్పులతో సతమతం అవుతున్నవారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇవి మరింత తీవ్రంగా మారతాయి. ముఖ్యంగా ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ నొప్పులు అనేవి ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఈ సమస్యలు..
సాధారణంగా చాలా మంది మహిళలు నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలి కాలంలో ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. కేవలం నడుము నొప్పి మాత్రమే కాకుండా కొందరికి మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇలా నొప్పులతో సతమతం అవుతున్నవారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇవి మరింత తీవ్రంగా మారతాయి. ముఖ్యంగా ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ నొప్పులు అనేవి ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. మరి ఈ నొప్పుల నుంచి తక్కువ కాలంలో రిలీఫ్ పొందాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పసుపు పాలు:
పసుపు, పాలు ఇవి రెండూ ఆరోగ్యానికి ఎంతో మంచివి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా పాలలో కాల్సియం, ఐరన్, రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. నడుము నొప్పి ఇతర నొప్పుల నుంచి తక్కువ కాలంలోనే రిలీఫ్ పొందాలంటే పసుపు పాలు ప్రభావంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలు క్రమం తప్పకుండా తాగితే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
వేడి నీటితో స్నానం చేయాలి:
నడుపు నొప్పి, ఇతర నొప్పులతో బాధపడే వారు ప్రతి రోజూ వేడి నీటితో మాత్రమే స్నానం చేయాలి. ఈ వేడి నీటిలో ఓ రెండు, మూడు చుక్కల యూకలిప్టస్ నూనె వేసి కలిపి స్నానం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంతే కాకుండా ఒత్తిడి సమస్యలు కూడా దూరం అవుతాయి.
సరైన భంగిమలో కూర్చోవాలి:
నడుపు నొప్పితో ఇబ్బంది పడే వారు ఎప్పుడూ కూడా సరైన భంగిమలో కూర్చోవాలి. వంగి కూర్చోవడం వల్ల నడుపు, వెన్ను నొప్పి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఇలా ఆఫీసుల్లో కూర్చునే వారు కనీసం గంటకు కనీసం పది నిమిషాలైనా లేచి వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
ఆయుర్వేద ఆయిల్స్ తో మర్దనా చేయాలి:
నడుపు నొప్పి, ఇతర నొప్పులతో బాధ పడేవారు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడేవారు ఆయుర్వేద గుణాలతో తయారు చేసే నూనెలతో మర్దనా చేసుకుంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆవ నూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేయించి.. నొప్పులు ఉన్న ప్రాంతంలో రాస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.