Actress : 58 ఏళ్ల హీరోకు నేను తల్లిగా నటించాలా.. ? రిజెక్ట్ చేసిన 38 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. 1200 కోట్లు వసూలు చేసిన సినిమా..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో గుర్తింపు రావడం అంత సులభమేమి కాదు. హీరోయిన్ గా మంచి ఫాంలో ఉండగానే తల్లి పాత్రలలో నటించడానికి చాలా మంది తారలు అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్స్ కథ, పాత్ర ప్రాధాన్యతను బట్టి తల్లి పాత్రలు పోషించేందుకు రెడీ అవుతున్నారు.

సాధారణంగా హీరోలు వయసుతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. అలాగే తమకంటే చిన్న నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కానీ హీరోయిన్స్ మాత్రం పెళ్లి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. ఒక నిర్దిష్ట వయస్సుకు చేరుకున్న తర్వాత, తల్లి పాత్రలు పోషిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కొందరు హీరోయిన్స్ తమకంటే చాలా పెద్ద నటులకు తల్లిగా నటించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ తనకంటే 20 సంవత్సరాలు పెద్ద నటుడి తల్లిగా నటించింది. ఆమె పేరు రిధి డోగ్రా. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో రితి డోగ్రా యువ షారుఖ్ ఖాన్ తల్లిగా నటించింది. ఈ చిత్రంలో నటించినప్పుడు షారుఖ్ ఖాన్ వయసు 58 సంవత్సరాలు. రితి డోగ్రా వయసు 38 సంవత్సరాలు. ఆమె హిందీలో సీరియల్స్‌లో నటిస్తూ, లక్కత్ బాగ్డా చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
జవాన్ సినిమా గురించి గతంలో రిధి డోగ్రా మాట్లాడుతూ.. “అట్లీ కార్యాలయం నుండి నాకు కాల్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే అది ‘జవాన్’ అని నాకు తెలిసింది. అట్లీ నాకు కథ చెప్పినప్పుడు, ‘నేను ఈ పాత్రలో ఎలా సరిపోతాను’ అని అన్నాను. నేను ఈ సినిమాలోని యువ షారుఖ్ ఖాన్ తల్లిని కాబట్టి నటించడానికి నిరాకరించాను. దీపిక తర్వాత నేను కావేరీ అమ్మగా మారిపోయాను. ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డు పాత్రలో కనిపించాను. షారుఖ్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎవరైన మిస్ చేసుకుంటారా.. ? కానీ షారుఖ్ తల్లిగా నటించడం ఇప్పటికీ వింతగా.. ఒక కలలా అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే షారుఖ్ తో మరో సినిమా ఛాన్స్ వస్తే నటించాలనుకుంటున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా తదితరులు నటించారు. ఇందులో దీపికా పదుకొణే అతిథి పాత్రలో కనిపించింది. ఈ మూవీలో ఆజాద్ తల్లి ఐశ్వర్య రాథోడ్ పాత్రలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..




