Bigg Boss Telugu 9: బిగ్‌బాస్9లోకి టాలీవుడ్ టాప్ కమెడియన్! వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్ బ్యాచ్‌మేట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా జరుగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే నాలుగో వారం ఎండింగ్ కు చేరుకుంది. కాగా హౌస్ లోకి ఇప్పటికే ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి సెలబ్రిటీ కోటాలో ఒక ప్రముఖ నటుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా జరుగుతుంది. బిగ్ బాస్ ఇచ్చే కొత్త గేమ్స్, టాస్కులు, ట్విస్టులు, కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు , ఊహించని ఎలిమినేషన్లు, మిడ్ వీక్ వైల్డ్ కార్ట్ ఎంట్రీలు.. మొత్తానికి గతం కంటే కొంచెం భిన్నంగా ఈ బిగ్ బాస్ సీజన్ సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. అందులో ఇప్పటికే ముగ్గుర బయటకు వెళ్లిపోయారు. ఈ వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. కాగా గత వారం మధ్యలోనే దివ్య నికితా వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి అడుగు పెట్టింది. ‘అగ్నిపరీక్ష’ షో సత్తా చాటిన ఆమె కామనర్స్ కోటాలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సామాన్యుల కేటగిరీలో ఇదే అగ్నిపరీక్ష షో నుంచి మరొకరు కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశముంది.
ఇక సెలబ్రిటీ కోటాలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. సీరియల్ హీరోయిన్ సుహాసిని, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కావ్యశ్రీ, అమర్ దీప్ కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నట్లు సమాచారం. ఇందుకోసం బిగ్ బాస్ టీం ఇప్పటికే అతనిని సంప్రదించిందని సమాచారం.
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు ప్రభాస్ శీను. విక్రమార్కుడు, పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, ఊసరవెల్లి, గబ్బర్ సింగ్, సింగిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వందల సినిమాల్లో నటించాడు ప్రభాస్ శీను. కాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, శ్రీను ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాచ్ మేట్స్‌గా కూడా ఉన్నారు. ఇక ప్రభాస్ సినిమాల్లో హీరోగా బిజీ అయిన తర్వాత పర్సనల్ అసిస్టెంట్ గా ప్రభాస్ డేట్స్‌ను శ్రీనునే మేనేజ్ చేస్తున్నాడు. ఇటీవలే సింగిల్ సినిమాతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ప్రభాస్ శీను చేతిలో మరో రెండు, మూడు సినిమాలున్నాయి. మరి ఈ సినిమాలకు బ్రేక్ ఇచ్చి అతను బిగ్ బాస్ లోకి వస్తాడో? లేదో? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రభాస్ శ్రీను
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








