డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు A, B కాంప్లెక్స్, C తో పాటు పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే, డ్రై ఫ్రూట్స్ ను రోజులో ఏ సమయంలో తింటే గరిష్ట లాభాలు కలుగుతాయని చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి.