Tollywood: ఎన్టీఆర్ ‘ఆది’ సినిమాలో కనిపించిన ఈ నటుడిని గుర్తు పట్టారా? స్టార్ హీరో మెటీరియల్.. కానీ చివరికీ..
సినిమా ఇండస్ట్రీలో ఇతనిది సుమారు 25 ఏళ్ల ప్రస్థానం. వందలాది సినిమాల్లో నటించాడు. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటుడిగా, కమెడియన్ గా అలరించాడు. ఇప్పటికీ సినిమాలు, టీవీ షోస్ లో నటిస్తున్నాడీ సీనియార్ యాక్టర్. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.

పై ఫొటోను గమనించారా? ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలోని ఓ సన్నివేశం. ఇందులో అలీ పక్కనున్నదెవరో గుర్తు పట్టారా? నటుడిగా వందలాది చిత్రాల్లో మెరిశాడు. స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కానీ అన్ని సైడ్ క్యారెక్టర్లే కావడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే ఏనాడు ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోలేదు. నటనలోనే తన జీవితాన్ని వెతుక్కున్నాడు. సినిమాలు చేస్తున్న సమయంలోనే జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన పంచులు, ప్రాసలు, కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటించినా రానీ గుర్తింపు ఒక్క జబర్దస్త్ కామెడీ షోతో సొంతం చేసుకున్నాడు. ఒక టీవీ షోలో రాఘవేంద్ర రావు గెటప్ లో వచ్చిన ఈ నటుడిని చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం ఆశ్చర్యపోయారు. నిజంగానే దర్శక కేంద్రుడు వచ్చారేమోనని నమస్కారం పెట్టబోయారు. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. అతను మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ గడ్డం నవీన్. పై ఫొటో ఆది సినిమాలోనిది. ఇందులో నవీన్ అలీ స్నేహితుడిగా నటించాడు.
టీనేజ్ లో నవీన్ బాడీ పర్సనాలిటీ, స్టైల్ చూస్తే కచ్చితంగా స్టార్ హీరో అవ్వాల్సిన వాడు అనిపిస్తుంది. అప్పట్లో ఫుల్ జుట్టుతో.. సూపర్ హెయిర్ స్టైల్‌తో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడతను. కానీ దురదృష్టవశాత్తూ సినిమాల్లో ఎక్కువగా సైడ్ క్యారెక్టర్ రోల్స్ రావడంతో నవీన్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. 1997లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను రామసక్కనోడు, ఆది, ఇష్టం, 16 టీన్స్, ఇడియట్, స్టూడెంట్ నెం.1, సుబ్బు, అశోక్, బన్నీ, బ్యాడ్ బాయ్స్ తదితర సినిమాల్లో కమెడయన్ గా, సహాయక నటుడిగా కనిపించాడు. అయితే జబర్ధస్త్ లోకి వచ్చిన తర్వాతే నవీన్ కు మంచి గుర్తింపు లభించింది.
ఫ్యామిలీతో జబర్దస్త్ గడ్డం నవీన్..
View this post on Instagram
ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపిస్తున్నారు గడ్డం నవీన్. అలాగే సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కే-ర్యాంప్ తో పాటు రవితేజ మాస్ జాతర, రాజ్ తరుణ్ చిరంజీవ తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు నవీన్.
స్టూడెంట్ నెం. సినిమాలో జులపాల జట్టుతో గడ్డం నవీన్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








