AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhanu Chander: ఒకప్పటి యాక్షన్ హీరో భానుచందర్ గుర్తున్నాడా? ఆయన కుమారుడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో..

80-90వ దశకంలో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భాను చందర్. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన తెలుగుతో పాటు తమిళంలోనూ వందలాది సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సహాయక నటుడిగానూ అలరించారు. భాను చందర్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Bhanu Chander: ఒకప్పటి యాక్షన్ హీరో భానుచందర్ గుర్తున్నాడా? ఆయన కుమారుడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో..
Bhanu Chander
Basha Shek
|

Updated on: Oct 01, 2025 | 7:55 PM

Share

సీనియర్ హీరో భాను చందర్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 80-90వ దశకంలో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోగా వెలుగొందారాయన. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఈ నటుడు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. 1978లో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు భాను చందర్. మొదటి మూవీతోనే ట్యాలెంటెడ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బెబ్బులి, ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం, వంశ గౌరవం, ఇద్దరు కిలాడీలు, మెరుపు దాడి, రేచుక్క, పున్నమి రాత్రి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించాడు భాను చందర్. 1986లో వచ్చిన నిరీక్షణ సినిమా ఈ నటుడి సినిమా కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో భానుచందర్ నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. పలు అవార్డులు కూడా ఆయనకు వచ్చాయి. అలాగే ‘కీచురాళ్లు’ సినిమా కూడా భాను చందర్‌కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. యాక్షన్ హీరోగా ఓ వెలుగు వెలిగిన భాను చందర్ ఆ తర్వాతి కాలంలో సహాయక నటుడిగానూ మెప్పించారు. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తున్నారీ సీనియర్ నటుడు. దేవి, సింహాద్రి, స్టైల్, దుబాయ్ శీను తదితర సినిమాల్లో భాను చందర్ కీలక పాత్రలు పోషించాడు. ఆ మధ్యన వచ్చిన రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్), మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాల్లో భాను చందర్ సహాయక నటుడిగా కనిపించారు.

సినిమాల సంగతి పక్కన పెడితే భాను చందర్ కు భార్య స్వర్ణ, ఇద్దరు కుమారులు జయంత్, నిషాంత్ ఉన్నారు. అయితే భాను చందర్ కుమారుడు కూడా తెలుగులో క్రేజీ హీరో అనే విషయం చాలా మందికి తెలియదు. అతని పేరు జయంత్. తండ్రి అడుగు జాడల్లోనే నడిచిన జయంత్ ‘నా కొడుకు బంగారం’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి భాను చందరే ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. దీంతో పాటు తమిళంలో మర్గాజీ 16 అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా చేశాడు జయంత్. అయితే ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి. దీంతో వీటి తర్వాత సినిమాలు చేయలేకపోయాడు జయంత్.

ఇవి కూడా చదవండి
Bhanu Chander Son Jayanth

Bhanu Chander Son Jayanth

 భాను చందర్ ఫ్యామిలీ ఫొటో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!