- Telugu News Photo Gallery Cinema photos Manchu Manoj Visits Assam Kamakhya Devi Temple With His Wife, See Photos
Manchu Manoj: భార్యతో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన మంచు మనోజ్.. ఫొటోస్ ఇదిగో
చాలా కాలం తర్వాత మిరాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు హీరో మంచు మనోజ్. భైరవంతో రీఎంట్రీ ఇచ్చిన మంచు వారబ్బాయికి మిరాయ్ సినిమా మరింత బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో మంచు మనోజ్ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టాడు.
Updated on: Oct 01, 2025 | 6:29 PM

నవరాత్రుల సందర్భంగా 51 శక్తి పీఠాల్లో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి పొందిన అస్సాం గౌహతిలోని పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్యదేవి ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్.

సతీమణి భూమా మౌనిక, స్నేహితులతో కలిసి గౌహతి చేరుకున్న మనోజ్ కు హోటల్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మంచు మనోజ్ కొత్త సినిమా మిరాయ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో అందరినీ ఆకట్టుకున్నాడు మంచు వారబ్బాయి.

మిరాయ్ విజయం తర్వాత అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు మనోజ్. ఇప్పుడు కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ప్రస్తుతం మనోజ్ కామాఖ్యాదేవి ఆలయానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మంచు మనోజ్ కు అభినందనలు తెలుపుతున్నారు.

డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో అద్బుతంగా నటించాడు. యంగ్ హీరో తేజ సజ్జా, రితిక నాయక్ హీరోహీరోయిన్లుగా నటించారు.




