- Telugu News Photo Gallery Cinema photos Young beauty saanve megghana shared her latest stunning photos
ఏం వయ్యారం రా బాబు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న సాన్వి మేఘన
సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేశాం అన్నది కాదు ఎంత క్రేజ్ తెచ్చుకున్నాం అనేది ముఖ్యం.. చాలా మంది హీరోయిన్స్ పదుల సంఖ్యలో సినిమాలు చేసినా అంతగా గుర్తింపు తెచ్చుకోరు. కానీ కొంతమంది భామలు మాత్రం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు.
Updated on: Oct 01, 2025 | 1:57 PM

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేశాం అన్నది కాదు ఎంత క్రేజ్ తెచ్చుకున్నాం అనేది ముఖ్యం.. చాలా మంది హీరోయిన్స్ పదుల సంఖ్యలో సినిమాలు చేసినా అంతగా గుర్తింపు తెచ్చుకోరు. కానీ కొంతమంది భామలు మాత్రం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది యంగ్ బ్యూటీ తక్కువ సినిమాలతో పాపులర్ అయ్యి.. ఇప్పుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.

వారిలో శాన్వి మేఘన ఒకరు. శాన్వి మేఘన 1998 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ 2019లో “సైరా నరసింహారెడ్డి” సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించింది. ఆ తర్వాత “పిట్ట కథలు” , “బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్”, “పుష్పక విమానం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

“పుష్పక విమానం”లో ఆమె షార్ట్ ఫిల్మ్ హీరోయిన్‌గా చేసిన పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది. తమిళ్ లో ఆమె కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

తెలుగులో రీసెంట్ గా టుక్ టుక్ అనే సినిమా చేసింది. చేసిన సినిమాలన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నా ఈ భామకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది ఈ అమ్మడు. ఇప్పటికైన ఈ అమ్మడికి పెద్ద సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రాళ్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




