చీరకట్టులో బాపుబొమ్మలా.. మతిపోగొడుతున్న మడోన్నా సెబాస్టియన్
మడోన్నా సెబాస్టియన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ తెలుగులో అంతగా చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ మలయాళం, తమిళ్ లోనూ ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ అందుకుంది.
Updated on: Oct 01, 2025 | 1:51 PM

మడోన్నా సెబాస్టియన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ తెలుగులో అంతగా చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది.

కానీ మలయాళం, తమిళ్ లోనూ ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ అందుకుంది. అక్టోబర్ 1, 1992 న కేరళలోని కొచ్చిలో జన్మించింది మడోన్నా సెబాస్టియన్. బెంగుళూరులో కాలేజీ చదువులు పూర్తి చేసిన తర్వాత, దర్శకుడు అల్ఫోన్స్ పుతిరన్ దర్శకత్వం వహించిన 2015 చిత్రం ప్రేమమ్‌తో ఆమె చిత్ర పరిశ్రమలో నటిగా అరంగేట్రం చేసింది.

మలయాళంలో ప్రేమమ్ సినిమా ఓ క్లాసిక్ గా నిలిచింది. మడోన్నా సెబాస్టియన్ ప్రేమమ్ సినిమాలో నటించి అందరికి తెలిసిన విషయమే ఆతర్వాత నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. కాగా తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ తర్వాత తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో నటించి ఆకట్టుకుంది. 2024లో ప్రభుదేవాతో కలిసి జాలియో జింఖానా చిత్రంలో నటించింది. చాలా కాలం తర్వాత నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది.

ప్రస్తుతం మడోనా తెలుగు సినిమాల కంటే తమిళ్, మలయాళ సినిమాల పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు.




