- Telugu News Photo Gallery Cinema photos Kiran Abbavaram Wife Rahasya Gorak Celebrates Dussehra Wth Her Son, See Photos
Kiran Abbavaram: రహస్య దసరా సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా?
హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య ఈ ఏడాది మేనెలలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ పిల్లాడితో కలిసి దసరాని సెలబ్రేట్ చేసుకుంది రహస్య. అనంతరం ఆ ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది.
Updated on: Sep 30, 2025 | 7:55 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ జోడీ ఒకటి. తమ మొదటి సినిమాలోనే ప్రేమలోనే పడిన వీరు గతేడాది ఇరు పెద్దల అనుమతిలో పెళ్లిపీటలెక్కారు.

2024 ఆగస్టులో పెళ్లిపీటలెక్కారు కిరణ్ అబ్బవరం- రహస్య. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా ఈ ఏడాది మే నెలలో ఓ బుడ్డోడు ఈ దంపతుల జీవితంలోకి అడుగు పెట్టాడు.

కొన్ని రోజుల క్రితం తిరుమల శ్రీవారి సన్నిధానంలో తమ కుమారుడి నామకరణమహోత్సవం నిర్వహించారు కిరణ్ అబ్బవరం దంపతులు. తమ బుడ్డోడికి 'హను అబ్బవరం' అని పేరు పెట్టుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు

తాజాగా తన కుమారుడితో కలిసి దసరా పండగను సెలబ్రేట్ చేసుకుంది రహస్య. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపింది.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో కిరణ్ కుమారుడు హను చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కే-ర్యాంప్ అనే సినిమాలో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.




