అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐనవిల్లి మండలం, ఐనవిల్లి లంకలో మొసళ్ల సంచారం కలకలం రేపుతోంది. లంక భూముల్లో రెండు మొసళ్లు సంచరిస్తుండటంతో రైతులు భయపడుతున్నారు. ఇటీవల వరదలకు కొట్టుకొచ్చిన ఈ మొసళ్లు పొలాల్లోనే ఉండిపోయాయి. అధికారులకు సమాచారం అందడంతో మొసళ్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.