సాధారణంగా మార్కెట్లో పచ్చ ద్రాక్ష ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో చాలామంది దానిని తింటూ ఉంటారు. అయితే, పచ్చ ద్రాక్షతో పోలిస్తే నల్ల ద్రాక్షలో ఎక్కువ పోషకాలు, అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పచ్చ ద్రాక్షకు బదులుగా అప్పుడప్పుడు నల్ల ద్రాక్షను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు.