మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల ఒక అరుదైన దృశ్యం స్థానికులను, సోషల్ మీడియా వాడకందారులను ఆకట్టుకుంది. జిల్లాలోని ముస్మి, కర్ణగండి రహదారి పైన ఒక భారీ అడవిదున్న కనిపించింది. రోడ్డు దాటుతూ నెమ్మదిగా వెళ్తున్న ఆ అడవిదున్నను స్థానికులు తమ కెమెరాలలో బంధించారు. ఈ వీడియోలు, చిత్రాలు తక్షణమే స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.