Tollywood : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. క్రికెట్ వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు క్రేజీ హీరో.. ఎవరంటే..
ఒకప్పుడు ఆర్థిక సమస్యలు.. తినడానికి తిండి లేదు.. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలనుకున్నాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బుల్లితెరపై అతడు సూపర్ స్టార్. సీరియల్స్, సినిమాల ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు ఎవరో తెలుసా.. ?

వెండితెరతోపాటు బుల్లితెరపై అతడు చాలా ఫేమస్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అంతేకాకుండా తమిళంలో అతడు స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్. ఇటీవలే పలు వెబ్ సిరీస్ ద్వారా అలరించాడు. కానీ అతడు సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన అతడు.. ఇప్పుడు తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి పేరు జిషు సేన్ గుప్తా. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
గతంలో ఓ ఇంటర్వ్యూలో జిషు సేన్ గుప్తా మాట్లాడుతూ.. “నేను ఎలాంటి నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చాను. మా ఇంట్లో తిండికి డబ్బు లేని రోజులు ఉన్నాయి. నాన్న బిల్లు కట్టలేకపోయినందున మా ఇంట్లో ఆరు నెలలుగా విద్యుత్ లేదు. కానీ ఆ జీవితం చాలా సంతోషంగా ఉంది. డబ్బు లేకపోయినా, ఆ జీవితం అందంగా ఉంది. నా కుటుంబ పరిస్థితి కారణంగా నేను క్రికెట్‌కు వెళ్లి సాయంత్రం డ్రమ్స్ వాయించేవాడిని. నాకు 18 ఏళ్ల వయసులో ‘మహాప్రభు’ షో కోసం ఆడిషన్‌కు వెళ్లాను. ఆ సమయంలో నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ ఆడిషన్‌లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏడు రోజుల తర్వాత మా ఇంట్లో టెలిఫోన్ లేకపోవడంతో, వారు పొరుగువారి ఇంటికి ఫోన్ చేసి, స్క్రిప్ట్ పేపర్ కొనుక్కోమని అడిగారు. ‘మహాప్రభు’ షో నుండి నాకు రోజుకు రూ. 250 వచ్చేది. ” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆ షో అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా అతడు స్టార్ అయ్యాడు. ఆ సమయంలో తాను 72 గంటలు పనిచేసేవాడినని అన్నారు. అప్పట్లో అతడిని కోల్ కతా హృతిక్ రోషన్ అంటూ ఒక కవర్ పేజీ పై వేశారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో టీవీ షోలకు దూరంగా ఉండిపోయాడు. దీంతో మరోసారి కష్టాలు వెంటాడాయి. ప్రస్తుతం అతడు బెంగాళీ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..




