Delhi Rajeswari: స్టార్ హీరోలకు తల్లిగా.. ఈ సీనియర్ నటి గుర్తుందా. ? ఆమె చెల్లెలు తెలుగులో క్రేజీ నటి.. ఇప్పటికీ..
తెలుగులో వందల చిత్రాల్లో నటించిన సీనియర్ నటీనటులు గుర్తున్నారా.. ? స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా కనిపించిన నటీమణులు ఇప్పుడు సినిమాలకు దూరంగా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అందులో ఢిల్లీ రాజేశ్వరి ఒకరు. ఒకప్పుడు తెలుగులో ఆమె బిజీ ఆర్టిస్టు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

తెలుగు సినిమా ప్రపంచంలో స్టార్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం చాలా పాపులర్. కొన్ని వందల చిత్రాల్లో విభిన్నమైన పాత్రలలో కనిపించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపించిన ఆర్టిస్టులు కొందరు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతకీ మీకు నటి ఢిల్లీ రాజేశ్వరి గుర్తున్నారా.. ? తెలుగులో అనేక సినిమాల్లో నటించారు. ఢీ సినిమాలో మంచు విష్ణుకు తల్లిగా కనిపించారు. ఒకప్పుడు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. ఇంద్ర, చిత్రం, నువ్వే కావాలి, ఢీ, ఖుషీ ఖుషీగా, వెంకీ, ఆనందం, వసంతం, అంతఃపురం వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. సహజ నటనతో జనాలకు దగ్గరయ్యారు.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
హీరోలకు తల్లి పాత్రలలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఢిల్లీ రాజేశ్వరి. మంచు విష్ణు నటించిన ఢీ, వెంకీ సినిమాలు ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు ఇండస్ట్రీలో రాణించిన ఆమె.. ఇప్పుడు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. చాలా కాలంగా ఢిల్లీ రాజేశ్వరి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే మీకు తెలుసా.. ? ఆమె చెల్లెలు తెలుగులో క్రేజీ నటి. సినిమాలతోపాటు సీరియల్స్ ద్వారా చాలా ఫేమస్. ఇప్పటికీ బుల్లితెరపై ఆమె చాలా యాక్టివ్. ఆమె మరెవరో కాదు.. ప్రీతి నిగమ్. ఒకప్పుడు ఎక్కువగా పాపులర్ అయిన రుతురాగాలు సీరియల్ నటి. ఈ సీరియల్ ద్వారా ఆమె సినీరంగంలోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఆ తర్వాత చక్రవారం సీరియల్ ద్వారా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా చంద్రముఖి సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. తెలుగులో స్టూడెంట్ నెంబర్ 1, సంతోషం, ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, ఈ అబ్బాయి చాలా మంచోడు, కబడ్డి కబడ్డి, సై, అసాధ్యుడు వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది ప్రీతి నిగమ్.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..








