AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram Chiyaan : హీరో విక్రమ్ భార్య ఎవరో తెలుసా.. ? వీళ్లిద్దరి లవ్ స్టోరీలో సినిమాకు మించి ట్విస్టులు..

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన విక్రమ్.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీల్ లైఫ్ కంటే ఎక్కువగా రియల్ లైఫ్ లో కష్టాలు ఎదుర్కొన్నాడు. కొన్నేళ్లపాటు ఇంటికే పరిమితమయ్యాడు. ఇంతకీ విక్రమ్ భార్య గురించి మీకు తెలుసా.. ?

Vikram Chiyaan : హీరో విక్రమ్ భార్య ఎవరో తెలుసా.. ? వీళ్లిద్దరి లవ్ స్టోరీలో సినిమాకు మించి ట్విస్టులు..
Vikram Chiyaan
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2025 | 4:09 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోలలో విక్రమ్ చియాన్ ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చిత్రాలను తెలుగులోకి డబ్ చేయగా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హీరోయిజం సినిమాలు కాకుండా కంటెస్టెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ నటుడిగా మరిన్ని ప్రశంసలు అందుకున్నాడు. అయితే వెండితెరపై విజయం సాధించిన విక్రమ్.. రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. యాక్సిడెంట్ కారణంగా కొన్నేళ్లపాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత నటుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.

ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

ఇక విక్రమ్ రియల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆయన భార్య పేరు శైలజ బాలకృష్ణన్. అనుక్షణం విక్రమ్ వెన్నంటే నిలబడింది. కెరీర్ ప్రారంభంలో విక్రమ్ కు పెద్ద రోడ్ యాక్సిడెంట్ కావడంతో కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో మూడేళ్లు బెడ్ కే పరిమితమయ్యాడు. కాలు తీసేయాల్సి వస్తుందని డాక్టర్స్ చెప్పడంతో దానిని రక్షించుకోవడానికి ఏకంగా 23 సర్జరీలు చేయించుకున్నాడు. ఆ టైమ్ లో ఫిట్నెస్ ట్రైనర్ గా శైలజ బాలకృష్ణన్ పరిచయమైంది. మొదటిచూపులోనే శైలజను ఇష్టపడ్డాడు. దాదాపు ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే విక్రమ్ నాన్న క్రిస్టియన్, అమ్మ హిదూ.. శైలజ కుటుంబం కేరళలోని తలస్సెరీలోని హిందూ ఫ్యామిలీ.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

రెండు కుటుంబాలు వేరు కావడంతో ఇద్దరి పెళ్లికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మొదట తమ పెళ్లికి కుటుంబాలు ఒప్పుకోలేదని.. కానీ అందరినీ ఒప్పించి వివాహం చేసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విక్రమ్. 1992లో కేరళలోని గురువాయూర్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ముందుగా పెళ్లి చేసుకున్నామని.. ఆ తర్వాత చెన్నైలోని లాయోలా కాలేజ్ చర్చ్‌లో క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఆకాలంలో రెండు సంప్రదాయాలలో పెళ్లి జరగడం హాట్ టాపిక్ అని అన్నారు విక్రమ్. ఈ దంపతులకు అక్షిత, ధృవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్షిత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఏం. కరుణానిది మనవడు మను రంజిత్ ను పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇటీవలే బైసన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి :  Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి