Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఆయన ఒకరు. ఈ హీరో నటించిన 14 సినిమాలు థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. అతడు వెండితెరపై సూపర్ స్టార్ అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం సమాజం కోసం కష్టపడ్డారు. కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు తన వంతు సాయం చేసి కోట్లాది మంది జనాల్లో హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.

దక్షిణాదిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో అతడు ఒకరు. కన్నడ స్టార్ అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా తనదైన ముద్ర వేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అకాల మరణంతో కోట్లాది మంది అభిమానులను తీరని శోకసంద్రంలో పడేశారు. ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి సహయం చేస్తూ సమాజం కోసం జీవితం అంకితం చేశారు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. ? అతడే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఆయన అక్టోబర్ 29న కేవలం 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు.
పునీత్ రాజ్ కుమర్ మరణంతో కన్నడ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా కృంగిపోయింది. ఈ ఘటన తర్వాత బెంగుళూరులో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. కన్నడలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన పునీత్.. దాతృత్వ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందారు. పునీత్ నటించిన 14 సినిమాలు థియేటర్లలో 100 రోజులు పూర్తిచేసుకున్నాయి. సినిమాలతోపాటు ఆయన సామాజిక సేవ కార్యక్రమాల్లో తనవంత సాయం చేశారు. ఆయన 26 అనాథ శరణాలయాలను నడుపుతున్నారు. పేద పిల్లల కోసం 46 ఉచిత పాఠశాలలను ప్రారంభించాడు. దీనితో పాటు ఆయన 19 గో సంరక్షణ కేంద్రాలు, 16 వృద్ధాశ్రమాలను నడిపించారు. 2019 లో ఉత్తర కర్ణాటకను తాకిన భయంకరమైన వరదల సమయంలో సహాయం అందించిన మొదటి వ్యక్తి ఆయన. అలాగే, కరోనా మహమ్మారి క్లిష్ట సమయాల్లో కర్ణాటక ప్రభుత్వ సహాయ నిధికి రూ. 50 లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..
పునీత్ మరణానంతరం ఆయన కళ్లను దానం చేశారు. ఆయన బాటలోనే కర్ణాటకలో 1 లక్ష మందికి పైగా ప్రజలు తమ కళ్ళను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పునీత్ తన నట జీవితాన్ని ‘ప్రేమద కనికే’ చిత్రంతో ప్రారంభించాడు. అతను అనేక చిత్రాలలో బాల నటుడిగా నటించారు. కేవలం 10 సంవత్సరాల వయసులోనే పునీత్ రాజ్ కుమార్ ‘బెట్టడ హూవు’ చిత్రంలో బాల నటుడిగా తన పాత్రకు జాతీయ అవార్డును అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..

Puneeth Rajkumar New
ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..




