AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..

హారర్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా సంవత్సరాలుగా ఈ జానర్ చిత్రాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వణుకుపుట్టించే సస్సెన్స్ ఉన్నప్పటికీ ఈ జానర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం విడుదలైన హారర్ సినిమాలు ఇప్పటికీ అడియన్స్ మదిలో నిలిచిపోయాయి.

Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..
Kaun Movie
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2025 | 4:46 PM

Share

హారర్ సినిమాలు చూసే అలవాటు ఉందా.. ? అయితే మీకోసమే ఈ సైకలాజికల్ హారర్ మూవీని తీసుకువచ్చాము. ఊహించని ట్విస్టులు.. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో సాగే ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రానికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కౌన్. 1999లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్, మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటివరకు బాలీవుడ్‌లో అత్యుత్తమ సైకలాజికల్ హారర్ చిత్రం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ కేవలం 15 రోజుల్లో పూర్తయింది. అంతేకాదు.. ఈ చిత్రాన్ని స్క్రిప్ట్ లేకుండానే తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

స్క్రిప్ట్ లేదు.. పెద్దగా బడ్జెట్ లేదు.. పాటలు అసలే లేవు.. అలాగే.. ఈ సినిమాలో ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగించలేదు. అయినప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో సుశాంత్ సింగ్ సైతం కీలకపాత్ర పోషించారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం ఒకే ఇంట్లో జరిగింది. రామ్ గోపాల్ వర్మ, మనోజ్ బాజ్ పేయి ఇద్దరూ సినిమా షూటింగ్ సమయంలో చాలా సన్నివేశాలకు సెట్ లోనే డైలాగ్స్ రాశారు. స్క్రిప్ట్ లేకుండా స్టార్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ కేవలం 15 రోజుల్లో పూర్తయ్యింది.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఈ సినిమా కథ మొత్తం ఊర్మిళ మటోండ్కర్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆద్యంతం ఊహించని మలుపులు, సస్పెన్స్, థ్రిల్లర్ సీన్స్ మిమ్మల్ని ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తాయి. ప్రేక్షకులను ప్రతిక్షణం కొత్త ట్విస్టులతో సాగేలా చేస్తుంది. ఇందులో ఊర్మిళ తన నటనతో జనాల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

Follow Us
సైబర్‌ నేరాలకు చెక్ పెట్టే ఏఐ చాట్‌బాట్.. ఎలా వాడాలంటే?
సైబర్‌ నేరాలకు చెక్ పెట్టే ఏఐ చాట్‌బాట్.. ఎలా వాడాలంటే?
మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా..
మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా..
నాన్ వెజ్ తినని వారికి బెస్ట్ ఆప్షన్.. టేస్టీ సోయా కుర్మా రెసిపీ
నాన్ వెజ్ తినని వారికి బెస్ట్ ఆప్షన్.. టేస్టీ సోయా కుర్మా రెసిపీ
అద్భుతమైన మామిడి చీజ్‌కేక్ రెసిపీ ఇలా చేస్తే నోరూరాల్సిందే!
అద్భుతమైన మామిడి చీజ్‌కేక్ రెసిపీ ఇలా చేస్తే నోరూరాల్సిందే!
అట్టహాసంగా టీవీ9 నెట్‌వర్క్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
అట్టహాసంగా టీవీ9 నెట్‌వర్క్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
చెదరిన డాక్టర్ కల.. ముగ్గురు NEET విద్యార్ధులు బలి!
చెదరిన డాక్టర్ కల.. ముగ్గురు NEET విద్యార్ధులు బలి!
కాకరకాయ గింజలు చెత్త బుట్టలో వేస్తున్నారా?.. వారిక ఆరోగ్య ఖజానా..
కాకరకాయ గింజలు చెత్త బుట్టలో వేస్తున్నారా?.. వారిక ఆరోగ్య ఖజానా..
శాంసన్, గైక్వాడ్‌లకు ఇచ్చిపడేసిన ఆకాష్ సింగ్.. ఆ స్లిప్‌లో..?
శాంసన్, గైక్వాడ్‌లకు ఇచ్చిపడేసిన ఆకాష్ సింగ్.. ఆ స్లిప్‌లో..?
ఈ అలవాట్లు మీకుంటే డౌట్ లేదు.. మీరు బెస్ట్ ఫాదర్..
ఈ అలవాట్లు మీకుంటే డౌట్ లేదు.. మీరు బెస్ట్ ఫాదర్..
విజయ్‌తో తనను పోల్చడంపై రియాక్టైన పవన్ కల్యాణ్‌.. ఏమన్నారంటే?
విజయ్‌తో తనను పోల్చడంపై రియాక్టైన పవన్ కల్యాణ్‌.. ఏమన్నారంటే?