Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
ఒకప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 45 ఏళ్ల వయసులో సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలేసి బ్రహ్మాకుమారిగా మారింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

తెలుగులో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆనతి కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హిందీ సినిమాల్లో బిజీ అయ్యింది. అక్కడే వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో తెలుగులో నాగార్జునతో ఆమె చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఆ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే మోహన్ బాబు, శ్రీకాంత్, అబ్బాస్, ఆకాష్, అర్జున్ స్టార్ హీరలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తన సినీప్రయాణంలో దాదాపు 30కిపైగా సినిమాల్లో నటించింది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా అలరించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన భామ. చిన్నప్పుడే భరతనాట్యం, ఒడిస్సీ నేర్చుకుంది. దాదాపు పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఆమె ఉంటుంది. ఇక ఇప్పుడు ఆమె లగ్జరీ లైఫ్, కోట్ల ఆస్తి వదిలి బ్రహ్మా కుమారిగా మారింది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు గ్రేసీ సింగ్. అక్కినేని నాగార్జున సరసన సంతోషం చిత్రంలో నటించింది. ఈ మూవీతో తెలుగులో మంచి పాపులారిటి సొంతం చేసుకుంది. బొద్దుగా, ముద్దుగా కనిపించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. తెలుగు కంటే ముందు హిందీలో పలు సినిమాల్లో నటించింది. అమీర్ ఖాన్ కెరీర్ మలుపు తిప్పిన లగాన్ చిత్రంలో నటించింది గ్రేసీ సింగ్. ఈ మూవీతో హిందీలో ఆమె పేరు మారుమోగింది. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించిన గ్రేసీ సింగ్.. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం పాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన గ్రేసీ సింగ్.. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. కొన్నాళ్లుగా ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతున్నారు గ్రేసీ సింగ్. ఇటీవలే బ్రహ్మాకుమారీగా మారింది. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే తాను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దని నిర్ణయం తీసుకుంది.

Gracy Singh Movie
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




