Allu Sirish: మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం.. దేవుడు మరోలా ప్లాన్ చేశాడంటూ అల్లు శిరీష్ పోస్ట్.. ఏమైందంటే?
టాలీవుడ్ హీరో అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. నైనిక అనే అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. శుక్రవారం (అక్టోబర్31) ఈ కాబోయే దంపతుల గ్రాండ్ ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. అయితే ఈ వేడుక నేపథ్యంలో అల్లు శిరీష్ పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోల్లో ఒకరైన అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. నైనికా అనే అమ్మాయితో కలిసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టనున్నాడు. కొద్ది రోజుల క్రితం అల్లు శిరీషే స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాను నైనికా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని, ఇంట్లో ఒప్పుకున్నారని, త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నాం అని ట్వీట్ చేశాడు. అందులో ఎంగేజ్మెంట్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు. అయితే తనకు కాబోయే భార్య ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు అల్లు శిరీష్. అయితే ఇటీవల అల్లు వారింట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ లో నైనికా కూడా సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా అల్లు శిరీష్- నైనికాల నిశ్చితార్థం శుక్రవారం (అక్టోబర్ 31)న జరగాల్సి ఉంది. హైదరాబాద్ లోని తమ సొంతింట్లోనే ఈ గ్రాండ్ ఎంగేజ్మెంట్ వేడుకకు ప్లాన్ చేశారు. ఇందుకోసం అట్టహాసంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే మరికొన్ని గంటల్లో ఎంగేజ్మెంట్ జరగనుండగా అల్లు శిరీష్ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. వర్షం పడుతుండగా ఎంగేజ్మెంట్ డెకరేషన్ వర్క్స్ ఫొటో తీసిన శిరీష్.. ‘చలికాలంలో అవుట్‌డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశాను… కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అల్లు శిరీష్ పోస్ట్..

Allu Sirish Post
కాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేశారట. అవుట్‌డోర్‌లో, వెన్నెల వెలుతురులో స్టేజ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారట. కానీ మోథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎంగేజ్మెంట్ ఏర్పాట్లకు తీవ్ర ఆటంకం కలుగుతోందట. వర్షం తగ్గిపోయి వాతావరణం సహకరిస్తే ఔట్‌డోర్‌లోనే ఎంగేజ్మెంట్ వేడుక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ వర్షాలు ఆగకపోతే సింపుల్‌గా ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు కేవలం అల్లు, మెగా కుటుంబ సభ్యులు, నైనికా ఫ్యామిలీ మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.
హైదరాబాద్ చేరుకున్న అల్లు అర్జున్..
#AlluArjun arrives in #Hyderabad to attend his brother #AlluSirish’s engagement with #Nayanika on October 31, 2025.💍✨
Sirish had first announced the engagement on Oct 1 with a heartfelt Instagram post featuring the couple in #Paris. 🇫🇷❤️#Tollywood #AlluFamily #CelebrityNews pic.twitter.com/oQqXq2Mmt5
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) October 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




