AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobha Shetty: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి.. ప్రియుడితో కలిసి ఏడడుగులు.. వీడియోలు వైరల్

బిగ్ బాస్ బ్యూటీ, కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి రహస్యంగా పెళ్లి చేసుకుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఆమె పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసి చాలా మంద నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Shobha Shetty: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి.. ప్రియుడితో కలిసి ఏడడుగులు.. వీడియోలు వైరల్
Shobha Shetty
Basha Shek
|

Updated on: Oct 29, 2025 | 4:38 PM

Share

శోభా శెట్టి.. పేరుకు కన్నడ నటే అయినా తెలుగు ఆడియెన్స్ కు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌తో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల తార కార్తీక దీపంతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అందులో మోనిత పాత్రలో తన విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా మరింతగా ఫేమస్ అయ్యింది. గతేడాది కన్నడ బిగ్ బాస్ 11లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు రియాలిటీ షోస్ లోనూ విజేతగా నిలవనప్పటికీ తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది శోభ. ప్రస్తుతం పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. వీటి సంగతి పక్కన పెడితే శోభా శెట్టి నటుడు యశ్వంత్ రెడ్డి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కార్తీక దీపం సీరియల్ లో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ మొదలైంది. తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది శోభ. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఎంగేజ్మెంట్ యానివర్సరీ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్.

కాగా పెళ్లి గురించి అడిగినప్పుడు ఈ ఏడాదే చేసుకుంటామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది శోభా శెట్టి. ఈ నేపథ్యంలో తన పెళ్లిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు శోభా శెట్టి పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిలో పెళ్లి దుస్తుల్లో శోభ, యశ్వంత్ రెడ్డి నూతన వధూవరుల్లా కనిపించారు. ఇద్దరూ తలంబ్రాలు కూడా పోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పెళ్లి దుస్తుల్లో  శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి..

అయితే శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి నిజంగా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. ఓ జువెల్లరీ బ్రాండ్ యాడ్ షూట్ కోసం వీరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నిజం తెలుసుకున్న నెటిజన్లు నిజంగా పెళ్లెప్పుడు చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..