AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐ ఆఫీసర్ కూతురు.. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు 1500 కోట్లకు మహారాణి.. ఎవరో గుర్తు పట్టారా?

15 ఏళ్లకే సినిమా కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా గర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడీ అందాల తార సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది.

సీబీఐ ఆఫీసర్ కూతురు.. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు 1500 కోట్లకు మహారాణి.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Oct 29, 2025 | 9:16 AM

Share

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో అయితే బాలకృష్ణ, పవన్ కల్యాణ్, ప్రభాస్, రవితేజ, వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక తమిళంలో విజయ్ దళపతి, సూర్య, విక్రమ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్ వంటి బాలీవుడ్ స్టార్స్ తోనూ పనిచేసింది. ఈ హీరోయిన్ కు ఉన్న మరో ట్యాలెంట్ ఏంటంటే.. ఈ బ్యూటీ దాదాపు 7 భాషలు మాట్లాడగలదు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్, సంస్కృత భాషలు ఈ ముద్దుగుమ్మకు తెలుసు. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార. ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడీ ముద్దుగుమ్మకు ఓ ముద్దుల కూతురు కూడా ఉంది. అయితే సినిమాల్లో ఉండగానే బాగా సంపాదించిందీ టాలీవుడ్ హీరోయిన్. ఇక పెళ్లయ్యాక భర్త ఆస్తులతో కలిసి ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు రూ. 1500 కోట్లకు పైగానే ఆస్తులున్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఈ వేల కోట్ల మహారాణి ఎవరనుకుంటున్నారా? గజని హీరోయిన్ ఆసిన్.

ఆసిన్ కేరళలోని కొచ్చిలో జన్మించింది. తండ్రి జోసెఫ్ తొట్టుంకల్ సీబీఐ ఆఫీసర్‌గా పనిచేసి, ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఆసిన్ తల్లి పేరు సెలిన్ తొట్టుంకల్. మెడికల్ సర్జన్‌గా సేవలందించారామె. ఇక హాసిన్ చదువు మొత్తం కేరళలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఆసిన్ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. కొన్నియాడ్స్ చేసి దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

కూతురు బర్త్ డే వేడుకల్లో ఆసిన్ దంపతులు..

View this post on Instagram

A post shared by Asin Suriya (@asin.suriya)

14 ఏళ్ల కెరీర్‌లో సుమారు 25 సినిమాల్లో నటించిన ఆసిన్ మైక్రోమాక్స్ ఫౌండర్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. 2016 వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక ముద్దుల కూతురు ఉంది. సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్ సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇటీవలే తన 40వ పుట్టిన రోజు (అక్టోబర్ 26)ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Asin Suriya (@asin.suriya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి