Tollywoood: ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడిలా.. ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?
ఈ హీరో తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. హ్యాండ్సమ్ హీరోగా యూత్ కు మరీ ముఖ్యంగా అమ్మాయిల ఫేవరెట్ యాక్టర్ గా మారిపోయాడు. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తోన్న ఈ నటుడు ఇప్పుడు అసలు గుర్తు పట్టలేకుండా మారిపోయాడు.

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? ఇతను ఒకప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఈ నటుడు ఇప్పుడు కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అవి కూడ కమర్షియల్ వాసనలకు దూరంగా ఉండేలా వైవిధ్యమైన సినిమాలు మాత్రమే. ముఖ్యంగా ఎక్కువగా బయోపిక్స్ లో నటిస్తున్నాడు. వయసు 50 దాటిపోయానా సరే కుర్ర హీరోలు సైతం అసూయ పడేలా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న ఈ హీరో ఇప్పుడు ఓ సినిమా కోసం గుర్తు పట్టకుండా మారిపోయాడు. మరి తన నటనతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ఈ నటుడు ఎవరో కనిపెట్టారా? చాలా మంది ఇతనని చూసి మొదట దివంగత నటుడు కోట శ్రీనివాసరావు అని పొరపాటు పడ్డారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. అతను మరెవరో కాదు దక్షిణాదిలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరైన మాధవన్.
గతంలో ఎక్కువగా యూత్, లవ్ అండ్ రొమాంటిక్ సినిమాల్లో నటించిన మాధవన్ ఇప్పుడు ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నాడు. ఆ మధ్యన ప్రముఖ సైంటిస్ట్ నంబీ నారాయణన్ బయోపిక్ లో నటించి అందరి మన్ననలు అందుకున్నాడీ సీనియర్ హీరో. తన అద్బుత నటనకు అవార్డులతో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జీడీ నాయుడు అనే మరో బయోపిక్ లో నటిస్తున్నాడు మాధవన్. ఆ సినిమా ఫస్ట్ లుక్కే ఇది.
జీడీ నాయుడు విషయానికి స్తే.. ఈయనను ఎడిసన్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారు. పూర్తిపేరు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. తమిళనాడులోని కోయంబత్తూర్ లో పుట్టిన జీడీ నాయుడు ఎన్నో ఆవిష్కరణలకు ఆద్యుడు. ప్రస్తుతం మనం డైలీ లైఫ్ లో వినియోగిస్తోన్న జ్యూస్ పిండే మెషీన్, కాయిన్‌తో పనిచేసే ఫొనోగ్రాఫ్, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్, 16 ఎమ్ఎమ్ ప్రొజెక్టర్, ఓటు రికార్డింగ్ మెషీన్ లాంటివి రావడంలో జీడీ నాయుడు పాత్ర మరువలేనిది. అలాగే దేశంలో తొలి పాలిటెక్నిక్ కాలేజీ పెట్టింది కూడా ఈయనే కావడం విశేషం. అలాంటి వ్యక్తి బయోపిక్ లో ఇప్పుడు మాధవన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మాధవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. చాలా మంది దీనిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇందులో బట్టతలతో ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించిన మాధవన్ ను చూసి ఆశ్చర్యపోయారు.
జీడీ నాయుడి బయోపిక్ లో మాధవన్ ఫస్ట్ లుక్..
Maddy always takes that extra effort for all his films 🙌 No one can recognise him in the poster as G.D.N His transformation is 💯 @ActorMadhavan pic.twitter.com/VlzrqglLNo
— sridevi sreedhar (@sridevisreedhar) October 27, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








